సీఎం జగన్‌కు కృతజ్ఞతగా పి.గన్నవరంలో ర్యాలీ నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులతో వెంకట్రామిరెడ్డి
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి
పి.గన్నవరంలో ‘థాంక్యూ సీఎం సర్’ నినాదాలతో భారీ ర్యాలీ
పి.గన్నవరం: సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు జరిగిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయన అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.36 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏపీజీఈఎఫ్) వైస్ చైర్మన్ విప్పర్తి నిఖిల్ కృష్ణ ఆధ్వర్యాన ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో మూడు రోడ్ల సెంటర్ నుంచి దుర్గమ్మ గుడి వరకూ వివిధ శాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఉద్యోగులకు అండగా నిలిచి, గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసినందుకు ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ఆర్థిక శాఖ అధికారులు వద్దన్నా కొత్త పీఆర్‌సీ ప్రకారం పే స్కేల్ అమలు చేశారన్నారు. అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్న ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ‘మన ప్రభుత్వం – మన ప్రగతి’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment