bandi srinivas rao
-
ఉద్యోగుల సంఘం గవర్నర్‌ను కలవడం పబ్లిసిటీ స్టంట్: వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి/ విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్‌ను కలవడం పబ్లిసిటీ స్టంట్ అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(జీఇఎఫ్) అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించినట్టు ఆయన స్పష్టం చేశారు. కాగా, వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించిన తర్వాత గవర్నర్‌ను కలవడమేంటని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే వీఆర్ఏలు, ఎండీవోలకు పదోన్నతులు వచ్చాయి. సచివాలయ ఉద్యోగులకు ప్రొహిబిషన్ డిక్లేర్ చేయలేదా?. గతంలో ఉద్యోగుల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. అంతకు ముందు.. సూర్యనారాయణపై ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యనారాయణ ఉద్యోగ సంఘాలను విమర్శించడం మానుకోవాలి. ఆయన ఉద్యోగుల గురించి మాట్లాడితే బాగుంటుంది. మీరు ఛాంపియన్‌లా.. మమ్మల్ని చవటల్లా చిత్రీకరిస్తే ఊరుకోము. 11 పీఆర్సీలు సాధించిన ఘనత మా సంఘానిది. గవర్నర్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడకుండా మాపై విమర్శలు చేస్తున్నారు. నీ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులను తాకట్టు పెట్టొద్దు. సీఎం వైఎస్ జగన్ చర్చలకు పిలిస్తే.. నువ్వు ఎందుకు శ్రీకాకుళం పారిపోయావు అని ప్రశ్నించారు. -
సీఎం జగన్ మాటలతో సంతోషంగా ఉన్నాం: బండి శ్రీనివాసరావు
-
మంచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం జగన్ మంచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నామని.. రెండు, మూడు రోజుల్లో ఈ విషయమై ప్రకటన వస్తుందని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారన్నారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా ఆయన నోట్ చేసుకున్నారని తెలిపారు. అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని, మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని పదే పదే తెలిపారన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించారని తెలిపారు. రాష్ట్ర విభజన, కోవిడ్ కష్టాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేవని సీఎం చెప్పారని, తెలంగాణకు హైదారాబాద్ నుంచి ఆదాయం ఉన్నందున ఆ రాష్ట్రంతో పోల్చుకోవద్దని సూచించారని తెలిపారు. మొత్తంగా సీఎం జగన్‌తో సమావేశం సానుకూలంగా, ప్రశాంతంగా మంచి వాతావరణంలో సాగిందని చెప్పారు. సీఎం జగన్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పని చేస్తామని తెలియజేశామన్నారు. సీఎం మంచి పీఆర్సీ ప్రకటిస్తారు.. ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి సీఎం జగన్ మంచి పీఆర్సీ ప్రకటిస్తారన్న నమ్మకం ఉంది. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిన విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం వివరించారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం వస్తుంది. కొన్ని సంఘాలు 27 శాతం ఫిట్‌మెంట్‌కు తగ్గకుండా చూడాలని, కొన్ని సంఘాలు 34 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎంను కోరాయి. హైదరాబాద్ నుంచి రాజధానికి వచ్చిన ఉద్యోగులకు సీసీఎ, హెచ్ఆర్ఏ కొనసాగించాలని కోరారు. – ఎన్.చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) సీఎం మంచి చేస్తారనే నమ్మకం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. 34 శాతం ఫిట్మెంట్ అడిగాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఫిట్మెంట్ అడిగాం. సీఎం జగన్ మంచి చేస్తారనే నమ్మకం ఉంది. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన ఉంటుంది. నా చేతికి ఎముక ఉండదని అందరూ అంటూ ఉంటారని సమావేశంలో సీఎం జగన్ స్వయంగా చెప్పారు. అంత మాట చెప్పిన సీఎం.. ఉద్యోగులకు ఎందుకు మంచి చేయకుండా ఉంటారు? ఉదారంగా ఉండే విషయంలో, మానవతా దృక్పథం చూపే విషయంలో తనకన్నా ఎక్కువగా స్పందించేవాళ్లు తక్కువగా ఉంటారని కూడా సీఎం తెలిపారు. ఇదే సమయంలో కొన్ని వాస్తవాలను బేరీజు వేసుకోవాలనీ సీఎం చెప్పారు. మొత్తానికి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం పీఆర్సీ సమస్య రెండు, మూడు రోజుల్లో పరిష్కారం కానుంది. ఈ నెల 9వ తేదీ లోపు సమస్య పరిష్కారం కాకపోతే ఆ రోజున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఉద్యోగులకు ఇస్తోన్న ఐఆర్‌కు తగ్గకుండా ఫిట్మెంట్ ఉంటుంది. అశుతోష్ కమిటీ నివేదికను యథాతథంగా ఆమోదించాలని సీఎం జగన్‌ను కోరాం. అధికారుల కమిటీ నివేదిక కరెక్టు కాదని సీఎంకు తెలియజేశాం. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, సీసీఏ, పెన్షనర్లకు సంబంధించిన అంశాల్లో తేడాలు ఉన్నాయని వివరించాం. నాలుగు అంశాలపై ఉద్యోగులు, పెన్షనర్లు అసంతృప్తితో ఉన్నారని తెలిపాం. పది పీఆర్సీల్లో ఎక్కడా ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గిన దాఖలాలు లేవని వివరించాం. హెచ్ఆర్ఏపై చేసిన సిఫార్సులు అసంబద్ధంగా ఉన్నాయని తెలిపాం. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల గురించి వివరించాం. ఏడెనిమిది ఏళ్లుగా హెల్త్ కార్డులు నిర్వీర్యమయ్యాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పాం. ఉద్యోగుల డిమాండ్లకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి మరో భేటీ ఉండకపోవచ్చు పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో అంతిమ నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలని సీఎం కోరారు. ఉద్యోగ సంఘాలు కూడా తగ్గాలని, ఆర్థిక శాఖ అధికారులు కూడా కొంతమేర గణాంకాలను పెంచాలని సీఎం సూచించారు. పీఆర్సీపై మరో సమావేశం ఉంటుందని మేము భావించడం లేదు. ఇంత సేపు ఉద్యోగ సంఘాలతో సీఎం మాట్లాడిన పరిస్థితి గతంలో లేదు. సంఘాలుగా సైద్ధాంతిక విభేదాలు ఉన్నా.. అందరం వారి వారి సమస్యల్ని సీఎం జగన్‌కు తెలియజేశాం. – కేఆర్ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత -
'ఉద్యోగుల ఉసురు టీడీపీకి తగులుతుంది'
సాక్షి, విజయవాడ : శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లు పాస్ కాకపోవడం వల్లనే ఉద్యోగులకు జీతాలు రాలేదని, అందుకు టీడీపీ ఎమ్మెల్సీలే కారణమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ' టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడంతోనే మాకు జీతాలు రాలేదు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా ఉద్యోగుల ఉసురు టీడీపీ ఎమ్మెల్సీలకు తగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 1 తేదీన జీతాలు రావాలి. జీతాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో మూడు నెలలకు ఆర్డినెన్స్ తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు.. పది లక్షల మంది ఉద్యోగులు పెన్సర్స్ జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు.యాబై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలా మండలిలో జరగలేదు.. మాజీ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కౌన్సిల్ లో ఉండి కూడ ఉద్యోగులు మేలు జరలేదు.. అశోక్ బాబు ఉద్యోగులకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా ద్రవ్యవినిమాయ బిల్లును అడ్డుకున్నారు.' అంటూ తెలిపారు. (ఈఎస్ఐ స్కాంతో సంబంధం లేదని చెప్పగలరా ?) ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ' పథకం ప్రకారం మండలి చైర్మన్ ద్రవ్యవినిమయ బిల్లును అడ్డుకున్నారు. బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ ఎమ్మెల్సీలు పావుగా వాడుకున్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించారు. జీతాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బంది పడుతున్నారు..కౌన్సిల్ లో టీడీపీ ఎమ్మెల్సీ లు వ్యవహరించిన తీరును తీవ్రంగా కండిస్తున్నాము. బిల్లు పాస్ కాకపోతే జీతాలు రావని తెలిసి కూడా అశోక్ బాబు మాట్లాడకపోవడం దారుణం.' అంటూ వెల్లడించారు. (ఏపీలో 845 కొత్త పాజిటివ్ కేసులు) -
రాష్ట్ర విభజనకు నిరసనగా...జాతీయ రహదారి దిగ్బంధం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉదయం 11.30 నుంచి 11.50 గంటల వరకు 20 నిముషాల పాటు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో ఇరువైపులా అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళననుద్దేశించి సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా కార్యదర్శి, ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రపతిని రబ్బర్‌స్టాంప్‌గా అభివర్ణించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వీగిపోయినప్పటికీ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యను అన్ని రాజకీయ పార్టీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి సీమాంధ్రలోని కోట్ల మంది ఉద్యోగులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఖాతరు చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తుందన్నారు. ఓట్లు, సీట్ల కోసం తెలుగుజాతిని రెండు ముక్కలుగా కాంగ్రెస్ పార్టీ చీలుస్తోందని విమర్శించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుజాతిని ముక్కలు చేయడాన్ని నిరసిస్తూ పిల్లల నుంచి వృద్ధుల వరకు కాంగ్రెస్ చర్యలను ఎండగడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వస్తున్న నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు ఏకతాటిపై నిలిచి తిప్పికొట్టాలని కోరారు. రాష్ట్ర విభజనకు సంబంధించి రెండు నాల్కల ధోరణితో వ్యవహరించే పార్టీలు, నాయకులకు ప్రజలు రాజకీయ సమాధి కడతారని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు మాట్లాడుతూ కేంద్రంలోని యూపీఏకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రపై కక్ష కట్టిందని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం నిలబడటానికి సీమాంధ్ర ప్రజలు ఎక్కువ మంది ఎంపీలను అందిస్తే..అలాంటి ప్రజలకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఢిల్లీ పెద్దలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. జాతీయ రహదారిపై రాస్తారోకో కారణంగా నిముషనిముషానికీ నిలిచిపోయే వాహనాల సంఖ్య పెరిగిపోతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. నిర్వాహకులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. రాస్తారోకోలో ఎడ్యుకేషన్ మినిస్టీరియల్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఏ స్వాములు, వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘ జిల్లా నాయకుడు కే శరత్‌బాబు, ఏపీఎన్జీవో అసోసియేషన్ ఒంగోలు నగర అధ్యక్షుడు సయ్యద్నాసర్ మస్తాన్‌వలి, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీ చెంచయ్య, కే వెంకటేశ్వర్లు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్, ప్రసన్నకుమార్, సహకార శాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు పీ రామారావు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు మూర్తి, నీటిపారుదల ఉద్యోగుల సంఘ కార్యదర్శి ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, స్టేట్ ఆడిట్ ఉద్యోగుల సంఘ కార్యదర్శి బీ ఏడుకొండలు, వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘ నాయకుడు ఎస్కేబీఎన్ మీరావలి, ఏపీఎన్జీవో అసోసియేషన్ మహిళా విభాగం వైస్ చైర్పర్సన్ పీ మాధవి, నాయకులు పీ మదన్మోహన్, డీ నాగేశ్వరరావు, కే శివకుమార్, పీ రోజ్‌కుమార్, కే కోటేశ్వరమ్మ, షేక్ మగ్బుల్షరీప్, తోట శ్రీనివాస్, రామాంజనేయులు, తాడి శ్రీనివాస్, బీ కృష్ణకిషోర్, సీహెచ్ ఓంకార్, విద్యార్థులు పాల్గొన్నారు.