ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి
సాక్షి, విజయవాడ : శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లు పాస్ కాకపోవడం వల్లనే ఉద్యోగులకు జీతాలు రాలేదని, అందుకు టీడీపీ ఎమ్మెల్సీలే కారణమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ' టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడంతోనే మాకు జీతాలు రాలేదు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా ఉద్యోగుల ఉసురు టీడీపీ ఎమ్మెల్సీలకు తగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 1 తేదీన జీతాలు రావాలి. జీతాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో మూడు నెలలకు ఆర్డినెన్స్ తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు.. పది లక్షల మంది ఉద్యోగులు పెన్సర్స్ జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు.యాబై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలా మండలిలో జరగలేదు.. మాజీ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కౌన్సిల్ లో ఉండి కూడ ఉద్యోగులు మేలు జరలేదు.. అశోక్ బాబు ఉద్యోగులకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా ద్రవ్యవినిమాయ బిల్లును అడ్డుకున్నారు.' అంటూ తెలిపారు. (ఈఎస్‌ఐ స్కాంతో సంబంధం లేదని చెప్పగలరా ?)
ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ' పథకం ప్రకారం మండలి చైర్మన్ ద్రవ్యవినిమయ బిల్లును అడ్డుకున్నారు. బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ ఎమ్మెల్సీలు పావుగా వాడుకున్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించారు. జీతాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బంది పడుతున్నారు..కౌన్సిల్ లో టీడీపీ ఎమ్మెల్సీ లు వ్యవహరించిన తీరును తీవ్రంగా కండిస్తున్నాము. బిల్లు పాస్ కాకపోతే జీతాలు రావని తెలిసి కూడా అశోక్ బాబు మాట్లాడకపోవడం దారుణం.' అంటూ వెల్లడించారు. (ఏపీలో 845 కొత్త పాజిటివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment