జగన్ దృష్టికి కార్మికుల సమస్యలు | Labor issues to the attention of jagan | Sakshi
Sakshi News home page

జగన్ దృష్టికి కార్మికుల సమస్యలు

Published Thu, Oct 29 2015 1:06 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

జగన్ దృష్టికి కార్మికుల సమస్యలు - Sakshi

జగన్ దృష్టికి కార్మికుల సమస్యలు

విజయవాడ :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి. గౌతంరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిసిన ట్రేడ్ యూనియన్‌కు సంబంధించి పలు విషయాలపై చర్చించారు.

ఆర్టీసీ ఇటీవల పెంచిన బస్ చార్జీల పెంపు వల్ల ఇబ్బందులు, వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. గౌతంరెడ్డి సాక్షితో మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్‌కు సంబంధించి పలు అంశాలపై జగన్‌తో చర్చించానని, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆయనతో చర్చించినట్లు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement