సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెంబర్ వన్ ర్యాంకు రావడంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యల వల్లే టాప్ ర్యాంక్ వచ్చిందని ఆయన అన్నారు. కీలకమైన ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో (సులభతర వ్యాపార నిర్వహణ) రాష్ట్రం తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి శనివారమిక్కడ మాట్లాడుతూ... కరోనా దుర్భర పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం తోడ్పాటునిచ్చారని పేర్కొన్నారు. పరిశ్రమలు మళ్లీ నడిచేలా ఆర్థిక తోడ్పాటు, భరోసాను ముఖ్యమంత్రి కల్పించారని ఆయన అన్నారు. పెట్టుబడిదారులు ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారన్నారు. (ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్‌వన్)
సింగిల్ డెస్క్ పోర్టల్‌లో పరిశ్రమలకు భూ కేటాయింపులతో పాటు వాణిజ్య వివాదాలకు ఈ ఫైలింగ్ సౌకర్యం ఉందని మంత్రి మేకపాటి తెలిపారు. విజయవాడ, విశాఖలో వాణిజ్య వివాదాలకు ప్రత్యేక న్యాయస్థానం, ఔషధాల విక్రయ లైసెన్స్ ఆన్‌లైన్‌లోనే పొందే సౌకర్యం ఉందన్నారు. ఏటా రెన్యువల్ చేసుకునే అవసరం లేకుండా షాపులకు మినహాయింపు, కార్మిక చట్టాల కింద సింగిల్ ఇంటిగ్రేటెడ్ రిటర్న్స్ దాఖలుకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. ప్రతి పరిశ్రమలో స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తున్నామని అన్నారు. హిందూపురం, విజయవాడ, విశాఖ ఇండస్ట్రీయల్ పార్క్‌ల్లో వాణిజ్యవేత్తలతో పలుమార్లు ప్రభుత్వం సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి మేకపాటి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment