సాక్షి, అమరావతి : కరోనా విపత్తను ఎదుర్కోవడానికి సీఎంఆర్‌ఎఫ్‌లో భాగస్వాములు కావాలని మంత్రి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు పరిశ్రమలు అండగా ఉంటాయని, ఆక్సిజన్ పాలసీ, ఆక్సిజన్ తయారీ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. సీఎంఆర్‌ఎఫ్‌కు తన సొంత సంస్థ కేఎంసీ నుంచి రూ.కోటిన్నర ప్రకటించారు. మంత్రి పిలుపు మేరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు ముందుకొచ్చాయి. అమరరాజ బ్యాటరీ సంస్థ సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.కోటి విరాళం ప్రకటించింది.
చిత్తూరు జిల్లాలో 500 బెడ్ల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపింది. హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ తూ.గో.జిల్లాకు 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇస్తామని ప్రకటించింది. సీసీఎల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.కోటి 11 లక్షలు.. డిక్సస్ కంపెనీ రూ.75 లక్షలు విరాళం ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment