
సాక్షి, విజయవాడ: కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారుకు గుణపాఠం చెప్పాలని వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలను చర్చించినట్లు తెలిపారు.
కార్మిక గర్జనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆటో యూనియన్ సదస్సులు నిర్వహించాలని, యూనివర్శిటీల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment