తాగు, సాగునీరు, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు.
అనుమసముద్రంపేట, న్యూస్‌లైన్ : తాగు, సాగునీరు, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. పార్టీ మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, గోపిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని తెల్లపాడులో గడపగడపకూ వైఎస్సార్‌సీపీ పాదయాత్రను గౌతమ్‌రెడ్డి ప్రారంభించారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. తెల్లపాడు ఎస్సీ కాలనీలో, పాతూరు, కొత్తూరులో నాయకులతో కలిసి గడపగడపకూ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. మహానేత వైఎస్సార్ ప్రజల సంక్షేమం కోసం చేసిన అభివృద్ధి పనులను స్థానికులకు వివరిం చారు. వైఎస్సార్ సువర్ణపాలనను జగన్ మాత్రమే అందించగలరన్నారు. రాబో యే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాల ని కోరారు.
గామంలోని తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఆ యన్ను కోరారు. సమస్య పరిష్కారానికి గౌతమ్‌రెడ్డి సానుకూలంగా స్పందించా రు. కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుట్రలు ప న్నినా జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నాయకులు సూరా భాస్కర్‌రెడ్డి, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, సర్పంచ్ వెంక ట రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, బ్రహ్మారెడ్డి, ఉపసర్పంచ్ షౌకత్ ఆలి, నాయకులు షబ్బీర్, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖాదర్‌బాషా, హరికృష్ణారెడ్డి, తెల్లపాడు నాయకులు శ్రీనివాసులురెడ్డి, నారాయణరెడ్డి, సొసైటీ డెరైక్టర్ రమణారెడ్డి, వెంకటేశ్వర్లునాయుడు, పుల్లలచెరువు శ్రీనివాసులురెడ్డి, సూరా శ్రీనివాసులురెడ్డి, చాన్‌బాషా పాల్గొన్నారు.
చేనేతకు చేయూతనందిస్తాం
సంగం: పాలకుల నిర్లక్ష్యంతో నానాటికీ సమస్యల ఊబిలో చిక్కుకుపోతున్న చేనేత పరిశ్రమకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయూతనందిస్తుందని ఆ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి హామీ ఇచ్చారు. సంగంలో చేనేత కార్మికుడు బత్తూరి వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన ఆయనను స్థాని క చేనేత కార్మికులు కలిసి తమ కష్టాలు వివరించారు. గౌతమ్‌రెడ్డి స్పం దిస్తూ అందరికీ దుస్తులు అందించే చేనేత కార్మికులు., పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు లేక పస్తులుండటం దురదృష్టకరమన్నారు. మరమగ్గాలకు రాయితీలు ఇస్తూ చేనేత కార్మికులను పాలకులు గాలికొదిలేశారని విమర్శించారు. ఓ వైపు పెట్టుబడులు పెరిగిపోగా, మరోవైపు నేత వస్త్రాల ధరలు తగ్గి నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అర్థమవుతోందన్నారు. చంద్రబాబు పాలనలో పనులు లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, అప్పటి ప్రతిపక్ష నేత మహానేత వైఎస్సార్ అసెంబ్లీ సాక్షిగా ఉద్యమించారని గుర్తు చేశారు.
మహాప్రజాప్రస్థానం పాదయాత్రలో కష్టాలను స్వయంగా చూసి చేనేత కార్మికుల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. కార్మికుల జీవితాల్లో ఆనందం వస్తోందని సంతోషించే సమయంలో వైఎస్సార్ మృతిచెందడంతో మరోసారి చేనేత పరిశ్రమ కష్టాల్లో పడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. రాజన్న ఆశయాలను ఆయన తీరుస్తారని, కొన్ని రోజుల పాటు అధైర్యపడకుండా కష్టాలను ఓర్చుకోవాలని సూచించారు. జగనన్న ప్రభుత్వంలో చేనేత పరిశ్రమకు పూర్తి స్థాయిలో చేయూతనందించి జీవితాలు ఆనందమయం చేస్తామని చెప్పారు.