మాట తప్పని, మడమ తిప్పని నేత జగన్ | Y.S jagan mohan is the real leader | Sakshi
Sakshi News home page

మాట తప్పని, మడమ తిప్పని నేత జగన్

Published Fri, Apr 4 2014 3:31 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

Y.S jagan mohan is the real leader

మేకపాటి గౌతమ్‌రెడ్డి
 సోమశిల, న్యూస్‌లైన్: మాట తప్పని, మడమ తిప్పని ఏకైక నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. అనంతసాగరం మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా పార్టీ అభ్యర్థుల తరపున గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, మండల కన్వీనర్ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, నాయకుడు ఊరిబిండి ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
 
 మండలంలోని శంకరనగరం, రేవూరు, మినగల్లు, కొత్తపల్లి, పాతదేవరాయపల్లి, ముస్తాపురం, ఉప్పలపాడు, పీకేపాడు, సోమశిల, అనంతసాగరం, గౌరవరం, చిలకలమర్రి, బొమ్మలవరం, అగ్రహారం గ్రామాల్లో ఆయా సెగ్మెంట్ల పరిధిలో ప్రచారం నిర్వహించారు.  గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించాయని ఆరోపించారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ర్ట అభివృద్ధిని మరిచిన ఓ నాయకుడు ఇప్పుడు తానేదో చేస్తానంటూ మొసలికన్నీరు కారుస్తున్నారని పరోక్షంగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మహానేత వైఎస్సార్ పాలనలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు. ఆదివారం జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు.  అలాగే నెల్లూరు పార్లమెంటు నుంచి తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని, ఆత్మకూరు అసెంబ్లీ నుంచి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేకపాటి గౌతమ్‌రెడ్డిని నెల్లూరు మాజీ కార్పొరేటర్ రూప్‌కుమార్ యాదవ్ కలిసి అభినందనలు తెలిపారు.
 
 ఈ కార్యక్రమంలో అనంతసాగరం జెడ్పీటీసీ అభ్యర్థి పెయ్యల సంపూర్ణమ్మ, నాయకులు చిలకా సుబ్బరామిరెడ్డి, అక్కలరెడ్డి అంకిరెడ్డి, బుట్టి వెంకటసుబ్బారెడ్డి, రాపూరు సుబ్బారెడ్డి, పాలపాటి నాగిరెడ్డి, కేతా రామకృష్ణారెడ్డి, పాల వెంకటకృష్ణారెడ్డి, పోతల నరసింహులు, ఎస్థానీ, బట్రెడ్డి చక్రధర్‌రెడ్డి, ఎద్దుల శ్రీనివాసులురెడ్డి, బొద్దుకూరు వెంకటేశ్వర్లురెడ్డి, కాలువ నరసింహులు, రాచపల్లి రమణారెడ్డి, రత్నారెడ్డి, కేసరి వెంకటేశ్వర్లురెడ్డి, రమణయ్య యాదవ్, మలినేని కొండయ్య, అక్కలరెడ్డి భాస్కర్‌రెడ్డి, లింగంగుంట జయరామయ్య, కేతా రవీంద్రారెడ్డి, గుండుబోయిన వెంకటరమణతోపాటు వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement