సాక్షి, నెల్లూరు: పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన రాష్ట్రస్థాయి కమిటీల పునర్య్యవస్థీకరణలో జిల్లాకు కీలక పదవులు దక్కాయి. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడి గా, తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ను కేంద్ర పాలక మండలి సభ్యుడిగా నియమించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ అధికార ప్రతినిధిగా, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇటీవల వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన మేరిగ మురళీధర్‌ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా ఏడు చోట్ల ఎమ్మెల్యేలుగా పార్టీ నాయకులే ఉన్నారు. నెల్లూరు, తిరుపతి ఎంపీలుగా కూడా వైఎస్సార్‌సీపీ నేతలే కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వైఎస్సార్‌సీపీనే దక్కించుకుంది. ఈ క్రమంలోనే పార్టీని మరింత పటిష్టం చేసేందుకు జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు.
వైఎస్సార్‌సీపీలో జిల్లాకు కీలక పదవులు
Published Sun, Sep 7 2014 2:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement