రాజధాని నిర్మాణం పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ 50 వేల కోట్ల దోపిడీకి కుట్ర పన్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల తో మాట్లాడుతూ ‘స్విస్ చాలెంజ్’ విధానం అమలుపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా చంద్రబాబు మాత్రం రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకే అప్పగించాలనే ఏకైక ఉద్దేశంతో తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారని విమర్శించారు. రాజధాని ప్రాంతం అభివృద్ధి పనుల్లో ఇతర కంపెనీలేవీ పాల్గొనడానికి వీల్లేని విధంగా సింగపూర్ కన్సార్టియంకే దక్కే విధంగా విధానాలు రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.