ఆంధ్రప్రదేశ్ లో పాలన అస్తవ్యస్తంగా తయారైందని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్విస్ చాలెంజ్ పై కోర్టు ప్రశ్నిస్తే చంద్రబాబు ఏకంగా చట్టాలను మారుస్తున్నారని ఆరోపించారు. చట్టాలను మార్చుకుని ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నారా అని ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏ చట్టమైనా లోబడి ఉండాలని తెలియదా అని అడిగారు.