సువిశాలమైన రహదారులు.. జల మార్గాలు.. కనుచూపు మేర విస్తరించిన పచ్చిక మైదానాలు.. అందమైన ఉద్యానవనాలు.. ఆహ్లాద వాతావారణాన్ని పంచే నదీ తీరం.. ప్లై ఓవర్లు.. ఆకాశహర్మా్యలు.. భూతల స్వర్గాన్ని తలపించే రీతిలో అంతర్జాతీయ నగరాలను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామంటూ 3డీ సినిమా చూపించిన సీఎం చంద్రబాబు, సింగపూర్ సంస్థల కన్సార్టియం... రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చకుండానే రియల్ ఎస్టేట్ దందా చేసి రూ.లక్ష కోట్లు కొట్టేయడానికి పథకం వేశారు. అందులో భాగంగా మొదలుపెట్టిన రాజధాని ‘స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు’ ఓ పెద్ద కుంభకోణం. దీని కోసమే ‘స్విస్ చాలెంజ్’ పుట్టుకొచ్చింది. ఇప్పటివరకు ప్రతి అడుగునూ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే వేసుకుంటూ వచ్చింది.