Singapore Consortium
-
‘అమరావతిని నల్లధనం అడ్డాగా మార్చేశారు’
సాక్షి, విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు రంగుల కలగా మార్చడని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అంటే తెగ దోచేసే ప్రభుత్వం అని కొత్త అర్థం చెప్పారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని నిర్మాణం పేరిట చేస్తున్న దోపిడిపై టీడీపిని కడిగిపారేశారు. రాజధాని నిర్మాణాన్ని తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టె అంశంగా మార్చరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి భూదందా వెనుక వేలకోట్ల కుంభకోణం ఉందని, అడ్డగొలుగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. తాత్కాలికి నిర్మాణాల ముసుగులో వెయ్యి కోట్లు స్వాహా చేశారని జీవిఎల్ ఆరోపించారు. అమరావతిని టీడీపీ తన వ్యాపారాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. మోదీ తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో.. యనమల మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుంటే.. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు పంటి వైద్యం కోసం సింగపూర్‌కు వెళ్లి లక్షలు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ కన్సార్టియంకు అప్పగించిన 1690 ఎకరాల భూమిలో 1070 ఎకరాలను ఫ్లాట్లుగా అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినివ్వడంపై మండిపడ్డారు. ఆ కంపెనీ 306 కోట్ల పెట్టుబడులు పెట్టినదానికి 16 వేల కోట్ల విలువైన భూమిని అప్పగిస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధానికి ఈ అక్రమాలపై సమాచారం ఉందని, ఈ ల్యాండ్ మాఫియాకు తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదన్నారు. రాబోయే రోజుల్లో రెండు లక్షల కోట్ల అక్రమాలకు అమరావతి కేంద్రం కాబోతోందని ఆరోపించారు. అమరావతిని నల్లధనం అడ్డాగా, మరో స్విస్ బ్యాంక్‌గా చంద్రబాబు మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎన్నికల్లోపు కొంతైనా పురోగతి చూపండి
- సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు సీఎం వేడుకోలు - స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం సాక్షి, అమరావతి: రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు పనిని వెంటనే ప్రారంభించి, వచ్చే ఎన్నికల నాటికి కొంతైనా పురోగతి చూపించాలని చంద్రబాబు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను కన్సార్టియంను కోరారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమే ఉందన్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మాస్టర్ డెవలపర్‌గా స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీల కన్సార్టియంను ఎంపిక చేసిన ప్రభుత్వం సోమవారం విజయవాడలో దీనిపై ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రెండేళ్లలో సింగపూర్ కంపెనీలు తమ సామర్థ్యం చూపాలని కోరారు. అమరావతికి గుండెకాయ స్టార్టప్ ఏరియా రాజధానికి మూడు దశల్లో మాస్టర్ప్లాన్లు అందించిన తర్వాత తమ సేవలను కొనసాగించాలని సీఎం చంద్రబాబు కోరారని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు. నాణ్యమైన నిర్మాణాలు చేపడతా మన్నారు. స్టార్టప్ ఏరియా రాజధాని అమరావతికి గుండెకాయలా మారుతుందని చెప్పారు. దీంతోపాటు మరో మూడు ఒప్పంద పత్రాలపై చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సంతకాలు చేశారు. అమరావతిని భూతల స్వర్గంలా నిర్మిస్తాం అమరావతిని భూతల స్వర్గంలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి పనులకు తాళ్లాయపాలెం సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. విభజనతో నష్టపోయామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం అమెరికాకు వెళ్లి పలు కంపెనీలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అదే విధంగా నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్ది దానికి సైబరాబాద్ అని పేరు కూడా తానే పెట్టానన్నారు. విభజన జరిగిన తరువాత ఏపీని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సింగపూర్ వెళ్లినట్లు పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ అడిగిన వెంటనే ఆ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తనకు క్యాపిటల్ రీజయన్, క్యాపిటిల్ సిటీ, సీడ్ క్యాపిటల్ ప్లాన్లు ఇచ్చిందన్నారు. సింగపూర్ స్ఫూర్తితో అమరావతిని నిర్మించాలని, అందులో భాగంగానే సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. -
సింగపూర్ కన్సార్టియం-ఏపీ సర్కార్ మధ్య ఎంవోయు
విజయవాడ: సింగపూర్ కన్సార్టియం-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సోమవారం ఎంవోయు కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అమరావతి స్టార్టప్ ఏరియాకు మందడం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ ఎంవోయులో భాగంగా సింగపూర్ కంపెనీలకు 1691 ఎకరాలను ప్రభుత్వం అప్పగించనుంది. మరోవైపు సింగపూర్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ లింగాయపాలెంలో రైతులు ఆందోళనకు దిగారు. రాజధానికి తమ భూమలను ఇవ్వలేదని రైతులు తెలిపారు. తమ అనుమతి లేకుండానే సింగపూర్ కంపెనీలకు భూములు ఎలా కట్టబెడతారని రైతులు ప్రశ్నించారు. వెంటనే సింగపూర్ కంపెనీలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను తరిమేయడానికి ప్రభుత్వం యత్నిస్తోందంటూ లింగాయపాలెంలోని అంబేడ్కర్ విగ్రహానికి రైతులు వినతిపత్రం సమర్పించారు. -
అమరావతి తలపై సింగపూర్ ‘టోపీ’!
-
అమరావతి తలపై సింగపూర్ ‘టోపీ’!
సర్కారు జేబుకు చిల్లు పెట్టే ‘స్టార్టప్’ డీల్ - భూమి ఇచ్చి.. మౌలికవసతులు కల్పించేది ప్రభుత్వం - లే అవుట్లు వేసి అమ్ముకునేది సింగపూర్ కన్సార్టియం - భూమితో కలిపి రూ.13వేలకోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి వచ్చేవాటా రూ.446కోట్లు - రూ.304 కోట్ల పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీలకు దక్కేది రూ.5,768 కోట్లు - అమరావతి వేదికగా కనీవిని ఎరుగని నారావారి దోపిడీ ‘స్టార్టప్’ - సింగపూర్బాబు కనుసన్నల్లో మేనేజ్మెంట్ కంపెనీ సాక్షి, అమరావతి: అది ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ప్రజల నుంచి బలవంతంగా ‘సమీకరించిన’ భూమి.. అందులోనూ రాజధానికి గుండె వంటి స్టార్టప్ ఏరియాలో ఇప్పుడే ఎకరా రూ.4 కోట్లు పలుకుతున్న భూమి.. అలాంటి విలువైన భూమిని సింగపూర్ ప్రయివేట్ కంపెనీల కన్సార్టియంకు రాష్ట్రప్రభుత్వం అప్పగించబోతోంది. భూములిచ్చిన రైతులు గానీ, ఐదు కోట్ల మంది ప్రజలు గానీ ఏం ఆశిస్తారు? ఆ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మంచి లాభసాటి చర్చలు జరుపుతుందని భావి స్తారు.. అద్భుతమైన రాజధాని నిర్మించేస్తారని, అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూర్చుతారని, తద్వారా ప్రజాధనాన్ని కాపాడతారని ఆశిస్తారు. కానీ ఇక్కడ జరిగేది పూర్తిగా రివర్స్.. రూ. 7వేల కోట్ల విలువ చేసే భూమిని ఆ కంపెనీలకు అప్పగిస్తోంది.. రూ. 5,500 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తోంది.. కానీ సర్కారు తిరిగి పొందేది పిసరంత.. అంత విలువైన భూమిని అప్పగించేటపుడు గ్లోబల్ టెండర్లు పిలిచి, భూమి ఇస్తున్నాం కనుక మన ఖర్చేమీ లేకుండా, అభివృద్ధి చేసిన భూమిలో మనకు అధిక వాటా ఉండేలా.. మంచి లాభసాటి బేరం చూసుకోవాలి.. కానీ నారా వారి రూటే సెప‘రేటు’.. సర్కారు ‘అభివృద్ధి’ చేసిన భూమిలో లే అవుట్లు వేసుకుని అమ్మేసుకునేందుకు సింగపూర్ కన్సార్టియంకు సర్వహక్కులూ రాసిచ్చేశారు. మన వాటా కింద సగటున ఓ 8.7% ఇస్తే చాలని ఒప్పేసుకున్నారు. అభివృద్ధి చేసిన భూమిని అమ్మడం కోసం ముందు నిర్ణయించిన బేసిక్ ధర ఎకరా రూ. 4.1 కోట్లను కూడా తగ్గించేసి రూ. 62 లక్షలుగా ఫిక్స్ చేసే శారు.. ఇంత నష్టమైన బేరంగానీ, ఇంత లాలూచీగానీ ముందెన్నడూ ఎరిగి ఉండరు. ఆ కథేమిటో మీరే చూడండి. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో భూమికి తొలుత ప్రాథమిక ధర(బేసిక్ ప్రైస్) నిర్ణయించిన సర్కార్.. తాజాగా ఫిక్స్డ్ ప్రైస్(నిర్ణీత ధర) ఖరారు చేసేసింది. అంటే గతంలో ప్రాథమిక ధర నిర్ణయించారు. దానికి తగ్గకుండా ఎంతకు అమ్మినా మొత్తం ధరలో ప్రభుత్వానికి వాటా ఉండేది. ఇపుడు ఫిక్స్డ్ ధర నిర్ణయించారు. దానిపైనే సర్కారుకు రెవెన్యూ వాటా ఇస్తారు. పైన ఎంతకు అమ్ముకున్నా సర్కారుకు సంబంధం ఉండదన్నమాట. ప్రైవేట్ మేనే జ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని సింగపూర్ కన్సార్టియం ఎవరికి, ఎంతకు అమ్ముకున్నా ప్రభుత్వానికి సంబంధం ఉండదు. సింగపూర్ కన్సార్టియం, బాబు అండ్ కో భారీ ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకోవాలన్న ఎత్తుగడ లో భాగంగానే భూమికి ఫిక్స్డ్ ప్రైస్ నిర్ణయించి.. ఆ రేటుపై వచ్చే ఆదాయంలోనే ప్రభుత్వా నికి వాటా(రెవెన్యూ షేర్) ఇవ్వాలని నిర్ణయించారు. అదీ దశలవారీగా. మొత్తమ్మీద 15 ఏళ్లల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వల్ల ఖర్చుల న్నీ పోను రూ.5,768.60 కోట్ల ఆదాయం వస్తుందని సింగపూర్ కంపెనీలు తేల్చాయి. ఇందులో ప్రభుత్వానికి రూ.446 కోట్ల వాటా ఇస్తాయి. ఇలాంటి దారుణమైన డీల్‌కు చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూమి ఇచ్చి మౌలిక వసతులు కల్పించి రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో 1,691 భూమి ప్రభుత్వానిది. అలాగే ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూ.5,500 కోట్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున రూ.222 కోట్లను పెట్టుబడి పెడుతుంది. సింగపూర్ కన్సార్టియం కేవలం రూ.304 కోట్లే. కన్సల్టెన్సీలతో ప్రైవేట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా మార్కెటింగ్ చేసి భూమిని అమ్ముకునే సింగపూర్ కన్సార్టియంకు వచ్చే వాటా రూ.5,322.6 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేవలంం రూ.446 కోట్లే. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా(రెవెన్యూ షేర్) ఇచ్చే అంశంపై సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన సీల్డ్ కవర్‌పై మెకెన్సీ, హైపవర్ కమిటీ, సీఆర్డీఏ అథారిటీ అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికపై కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అంటే భూమి కాకుండా ధన రూపంలో రూ.5,722 కోట్ల పెట్టుబడి పెట్టే సర్కార్‌కు 15 ఏళ్లలో దక్కేది కేవలం రూ.446 కోట్లు. అంటే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వల్ల సర్కార్‌కు రూ.5,276 కోట్ల నష్టం వస్తుందన్నది స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూరుతున్నా.. ప్రైవేట్ మేనేజ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని తక్కువ ధరలకే భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికే సింగపూర్ కన్సార్టియంకు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును ప్రభుత్వ ముఖ్యనేత కట్టబెట్టేశారన్నది స్పష్టమవుతోంది. సర్కారు ఆమోదించిన సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలివీ.. ► 1,691 ఎకరాల్లోని రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు రూ.3,137 కోట్ల వ్యయం అవుతుంది. ఎకరం భూమి ప్రాథమిక విలువ(బేసిక్ ప్రైస్) రూ.4.1 కోట్లుగా నిర్ణయించింది. ► ఇందులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీ) వాటా రూ.222 కోట్లు.. సింగపూర్ కన్సార్టియం వాటా రూ. 304 కోట్లు. మిగతా నిధులను భూమిని తనఖా పెట్టడం, విక్రయించడం ద్వారా సమకూర్చుకుంటుంది. ఏడీపీలో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం.. రాష్ట్ర ప్రభుత్వ వాటా 42 శాతం. ► ఏడీసీ, సింగపూర్ కన్సార్టియం రెండు కలిసి సంయుక్తంగా ఏడీపీని ఏర్పాటు చేస్తాయి. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. సింగపూర్ కన్సార్టియం ప్రతినిధులు నలుగురు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. ఏడీపీకి సింగపూర్ కన్సార్టియం ప్రతినిధే ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీనిని బట్టి సింగపూర్ కంపెనీలు చెప్పిందే వేదం అని అర్ధం కావడం లేదూ? ► ఉత్ప్రేరక అభివృద్ధి కోసం ముందుగా 50 ఎకరాలను ఉచితంగా సింగపూర్ కన్సార్టియంకు అప్పగించాలి. ఇందులో ఎనిమిది లక్షల చదరపు అడుగుల్లో భవనాలు నిర్మించి విక్రయిస్తారు. ఇందులో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఇవ్వరు. ► రెండో దశలో 200 ఎకరాలను నామమాత్రపు ధరపై సింగపూర్ కన్సార్టియంకు అప్పగించాలి. ఈ భూమిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉండదు. ► 1,691 ఎకరాలను విక్రయించగా వచ్చే ఆదాయంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వాటా(రెవెన్యూ షేర్) ఇస్తామని ప్రతిపాదించింది. ► ఈ ప్రతిపాదన లపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన తర్వాతే స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ► రెవెన్యూ షేర్లో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ కన్సార్టియం గోప్యంగా ఉంచడాన్ని హైకోర్టు తప్పుపడుతూ టెండర్ల ప్రక్రియను ఆపేయాలని సెప్టెంబరు 12, 2016న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 5% వాటాకే అంగీకారం రెవెన్యూ షేర్లో ప్రభుత్వానికి ఇచ్చే వాటాపై సింగపూర్ కన్సార్టియం అందించిన సీల్డ్ కవర్‌ను మార్చి 3న సీఆర్డీఏ అధికారులు తెరిచారు. మొత్తం ఆదాయంలో 5 శాతం రెవెన్యూ షేర్ ఇస్తామని సింగపూర్ కంపెనీలు ప్రతిపాదించాయి. వీటికి సీఎం అధ్యక్షతన గల సీఆర్డీఏ అథారిటీ భేటీలోనే ఆమోదం తెలిపారు. అయితే ఐదు శాతం రెవెన్యూ షేర్ చాలా తక్కువంటూ విమర్శలు రావడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. దాంతో హైపవర్ కమిటీ ఏప్రిల్ 18, 24 తేదీల్లో సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో రెవెన్యూ షేర్ పెంపుపై సంప్రదింపులు జరిపింది. దీంతోఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. తొలి దశలో అంటే ఐదేళ్లలో 5 శాతం, రెండో దశలో మరో ఐదేళ్లలో 7.5 శాతం, మూడో దశ అంటే ఇంకో ఐదేళ్లలో 12 శాతం రెవెన్యూ వాటా ఇచ్చేందుకు సింగపూర్ కంపెనీలు అంగీకరించగా అందుకు ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. బేసిక్ ధర ‘ఫిక్సింగ్’ ఇలా.. ఎకరం భూమి బేసిక్ ధరను రూ. 4.1 కోట్లుగా తొలి ప్రతిపాద నల్లో సింగపూర్ కన్సార్టియం, ప్రభుత్వం నిర్ణయించాయి. అభివృద్ధి చేసి భూమిని ఎకరం రూ.4.1 కోట్లకు తక్కువ కాకుండా విక్రయించాలని సింగపూర్ కంపెనీలు తమ ప్రతిపా దనల్లో పేర్కొన్నాయి. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సంస్థకు నాలుగు కోట్ల కన్నా తక్కువ ధరకు విక్రయిం చమని కోరితే ఆ వ్యత్యాసం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని సింగపూర్ కంపెనీలు షరతు విధించాయి. అయితే ఇప్పుడు .. ఆ ప్రాంతంలో భూమి విలువ రూ.నాలుగు కోట్లు లేదని గ్రహించామని, అందువల్ల అభివృద్ధి చేసిన ఎకరం ఫిక్స్డ్ బేసిక్ ధరను రూ.62 లక్షలుగా నిర్ణయిస్తున్నట్లు సీఆర్డీఏ అథారిటీ పేర్కొంది. తొలి దశ, రెండో దశ, మూడో దశలో అభివృద్ధి చేసిన భూమి ఎంతకు విక్రయం అవుతుందో తెలియకుండానే ఈ మూడు దశల్లో భూముల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే నిర్ధారించేశారు. మూడు దశల్లో రూ. 5,768 కోట్లు ఆదాయం వస్తుందని, ఇందులో సర్కారుకు రూ.446 కోట్లు రెవెన్యూ షేర్ వస్తుందని లెక్కకట్టారు. ఇందుకు హై పవర్ కమిటీ, రాష్ట్ర కేబినెట్ ఆమోదించాయి. అంటే ఎక్కువ ధరకు సింగపూర్ కంపెనీలు భూములను విక్రయించినా ఆ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి రెవెన్యూ షేర్ ఉండదని స్పష్టం అవుతోంది. ఇక్కడే అసలు మతలబు ఉంది. దోపిడీకి మూలం ఇక్కడే ఉంది. సింగపూర్ కన్సార్టి యంకు సాగిలపడ్డ సర్కార్.. తొలుత ఆమోదించిన ప్రతిపాదనలను తుంగలోతొక్కి నష్టదాయకమైన తాజా ప్రతిపాదనలకు తలూపింది. స్టార్టప్ ఏరియా అప్పగింత సాక్షి, అమరావతి: పేరుకు స్విస్ చాలెంజ్ విధానం అయినప్పటికీ ఎటువంటి ఛాలెంజ్ లేకుండా సింగిల్ టెండర్‌పై సింగపూర్ కంపెనీలకు రాజధాని స్టార్ట్ అప్ ఏరియా ప్రాంతం 1691 ఎకరాలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో అంటే తొలి ఐదేళ్లలో సింగపూర్ కంపెనీలు రెవెన్యూ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి 5 శాతం మేర, రెండో దశలో అంటే మరో ఐదేళ్లలో 7.5 శాతం, మూడో దశలో అంటే ఇంకో ఐదేళ్లలో 12 శాతం రెవెన్యూ వాటా ఇవ్వనుందని సీఆర్డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఉత్తర్వుల్లో ఎంత ఆదాయంలో ఐదు శాతం అనేది స్పష్టం చేయలేదు. ఇటీవల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని హై పవర్ కమిటీతో పాటు కేబినెట్ ఆమోదించిన ఫైలులో మాత్రం ఆదాయం నిర్ధారించారు. ఆ ఆదాయ వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొనకుండా గోప్యంగా ఉంచారు. తొలుత సింగపూర్ కంపెనీలు రెవెన్యూ వాటా ఐదు శాతమే ఇస్తామన్నారని, అయితే ఇందుకు అంగీకరించకుండా సంప్రదింపులు జరపాలని ఉన్నతస్థాయి కమిటీని కోరినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటీ సంప్రదింపులు జరపగా తొలి దశలో ఐదు శాతం, రెండో దశలో 7.5 శాతం, మూడో దశలో 12 శాతం రెవెన్యూ వాటా ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలను ఆమోదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తద్వారా భూముల ధరలు పెరుగుతాయని, అలాగే ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఆదాయం పెరుగుతుందని తద్వారా రాష్ట్ర స్తూల ఉత్పత్తి పెరుగుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన మేరకు సింగపూర్ కంపెనీలు ఒప్పందాలను చేసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం సూచించింది. -
స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు ‘సింగపూర్’కే
సాక్షి, అమరావతి: ఎన్ని వివాదాలు వచ్చినా పట్టించుకోకుండా రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకే కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే దీనిపై అంగీకారానికి వచ్చినా.. అధికారి కంగా దాన్ని త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. రాజధాని వ్యవహారాలపై ఏర్పాటైన ఉపసంఘం సమావేశం మంగళవారం యనమల ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగింది. సింగపూర్ కన్సార్టియంకు స్టార్టప్ ప్రాజెక్టును అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాగా, ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి ఐదుశాతం వాటానే ఇస్తానని సింగపూర్ కన్సార్టియం పెట్టిన ప్రతిపాదనపై చర్చలు జరపాలని ఉపసంఘం సమావేశానికి హాజరైన సీఆర్డీఏ అధికారులకు సూచించింది. -
ఒక్క టెండరూ రాలేదు!
⇒ రాజధాని స్విస్ చాలెంజ్ టెండర్లకు స్పందన నిల్ ⇒ సింగపూర్ కన్సార్టియంకు అనుకూల నిబంధనల ఫలితం.. ముగిసిన గడువు సాక్షి, అమరావతి: అత్యంత వివాదాస్పదమైన రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం సీఆర్డీఏ పిలిచిన అంతర్జాతీయ టెండర్ నోటిఫికేషన్‌కు స్పందన కరువయ్యింది. మంగళవారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి ఒక్క సంస్థా టెండర్ దాఖలు చేయలేదు. ఈ విషయాన్ని సీఆర్డీఏ అధికారికంగా ధ్రువీకరించలేదు. రాజ ధానిలో 6.84 చదరపు కిలోమీటర్లలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును చేపట్టే మాస్టర్ డెవలపర్ ఎంపిక కోసం గత నెల నాలుగో తేదీన సీఆర్డీఏ రెండోసారి టెండర్లు పిలిచింది. ఇందుకు సంబంధించి మధ్యలో ప్రీబిడ్ సమావేశం నిర్వహించగా ఆరు కంపెనీలు వచ్చినా టెండర్లు మాత్రం దాఖలు చేయలేదు. స్విస్ ఛాలెంజ్ విధానం లో నిబంధనలన్నీ సింగపూర్ కన్సార్టియంకు అనుకూలంగా ఉండడంతో టెండర్లు దాఖలు చేసినా ఉపయోగం ఉండదనే ఉద్ధేశంతో ఏ సంస్థా ముందుకు రాలేదని స్పష్టమవుతోంది. లోపాలను చట్టబద్ధం చేసి.. 6.84 చదరపు కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు అభివృద్ధికి అసెండాస్–సింగ్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ లిమిటెడ్ కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడి గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలిచ్చాయి. దీన్ని ఆమోదించిన ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానంలో అంతకంటే మెరుగైన ప్రతిపాదనల కోసం మొదట 5 నెలల క్రితం అంతర్జాతీయ టెండర్లు పిలిచింది. ప్రభుత్వానికి నష్టం కలిగేలా, దేశీయ కంపెనీలకు అవకాశం లేనివిధంగా ఉన్న టెండరు నిబంధనలను పలు కంపెనీలు హైకోర్టులో సవాల్ చేశాయి. హైకోర్టులో అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలో కీలకమైన ఆదాయ వాటాను ఎందుకు వెల్లడించలేదనే దానికి సమాధానం చెప్పలేకపోయింది. తరావ్త ఏకంగా ఏపీఐడీఈ చట్టాన్నే మార్చేసింది. లోపాలను చట్టబద్ధం చేసింది. దానికనుగుణంగా జనవరి నాలుగో తేదీన సీఆర్డీఏ రెండోసారి స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండరు నోటిఫికేషన్ ఇచ్చింది. రెండు దశల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపింది. అయితే తొలి దశలోనే ఒక్క సంస్థ కూడా టెండరు దాఖలు చేయక పోవడం గమనార్హం. దీనిపై సీఆర్డీఏ అధికారులను ప్రశ్నించగా తమకు తెలియదని సమాధానమిచ్చారు. అదనపు కమిషనర్లు రామమనోహరరావు, మల్లికార్జున, టెండర్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న సీఆర్డీఏ ఆర్థిక విభాగం డైరెక్టర్ నాగిరెడ్డి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. -
స్విస్ చాలెంజ్ తో లక్షకోట్లకు ఎసరు!
-
హైకోర్టు ఆక్షేపించిన తప్పులనేకం
సరిదిద్దుకోవడానికి సర్కారుకు అవకాశం కానీ తమ చర్యలను సమర్థించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అడ్డుగా, ఇబ్బందిగా ఉన్న అన్ని అంశాలకు సవరణలు చట్టం అడ్డుతొలగించుకుని ఆర్డినెన్స్ జారీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి పనులకు సంబంధించి స్విస్ చాలెంజ్ పద్ధతి కింద సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదన.. పరిశీలన మొదలు, టెండర్ నిబంధనల వరకు అనుసరించిన విధానంలో ప్రభుత్వం చేసిన అనేక తప్పులను హైకోర్టు ఎత్తిచూపింది. ఎక్కడెక్కడ చట్ట విరుద్ధంగా వ్యవహరించారో సింగిల్ జడ్జి చెప్పారు. తప్పులను సరిదిద్దుకోవాలంటూ ప్రభుత్వానికి అవకాశమిచ్చారు. అయితే తప్పులను సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం ఆ పని చేయలేదు. స్విస్ చాలెంజ్ వ్యవహారంలో తమ చర్యలను సమర్ధించుకునేందుకు ఏకంగా చట్ట సవరణకే దిగింది. ఏపీఐడీఈ చట్టంలో ఏ ఏ అంశాలు తమకు అడ్డుగా, ఇబ్బంది ఉన్నా యో వాటిని చట్ట సవరణ ద్వారా తొలగించడమో, మార్చడమో చేసేసింది. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడిందన్నమాట. సింగిల్ జడ్జి తప్పుబట్టిన కీలక అంశాలివీ.. ** సింగపూర్ కన్సార్టియం తన ప్రతిపాదనల్లో పేర్కొన్న ఆదాయ వివరాలను ప్రాథమిక స్థాయిలో బహిర్గతం చేసి తీరాలి. అలా చేయకపోవడం చట్ట విరుద్ధమే. అసలు ఆదాయ వివరాలు ‘యాజమాన్య సమాచారం’ ఎంత మాత్రం కాదు. సింగపూర్ కన్సార్టియం అడిగింది కాబట్టి అది యాజమాన్య సమాచారం అవుతుందనడం ఎంత మాత్రం సరికాదు. ** కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాలు ప్రభుత్వానికి గానీ, సీఆర్డీఏ అధికారులకు గానీ తెలియకుంటే, అసలు ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట్రానికి ప్రయోజనకరమనే నిర్ణయానికి ఎలా రాగలరు.? సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలేవీ తెలియకుండానే, రూ.3 వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టు కోసం స్విస్ చాలెంజ్ పద్దతిన మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. ** ఏపీఐడీఈ చట్టంలోని సెక్షన్ 19–2 ప్రకారం మొదట ప్రధాన ప్రతిపాదికుడు తమ ప్రతిపాదనలను స్థానిక ఏజెన్సీ అయిన సీఆర్డీఏకు సమర్పించాలి. ఆ ప్రతిపాదనలను చూసి ప్రధాన ప్రతిపాదకుడికి ఆ ప్రాజెక్టు చేపట్టే అర్హత, సామర్థ్యం ఉన్నాయో తెలుసుకోవాలి. తరువాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పరిశీలన చేయాలి. ఆ తరువాత ప్రభుత్వానికి సిఫారసులు వెళ్లాలి. అయితే ప్రస్తుత కేసులో మొత్తం వ్యవహారం ‘రివర్స్’లో జరిగింది. ** కన్సార్టియం మొదట తమ ప్రతిపాదనలను నేరుగా ప్రభుత్వానికే సమర్పించింది. తరువాత ప్రభుత్వం నుంచి హైపవర్ కమిటీకి వెళ్లాయి. (హైపవర్ కమిటీ ఏర్పాటును చట్టం చెప్పలేదు). ఆ తరువాత సీఆర్డీఏకు అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి చేరి, మళ్లీ అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్లాయి. ** ఈ రివర్స్ విధానం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ స్వతంత్రత ప్రభావితమైంది. ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినప్పుడు, దానికి విరుద్ధంగా వెళ్లేందుకు సీఆర్డీఏ, ఇన్ఫ్రా అథారిటీ వంటి అధికార సంస్థలు ఇబ్బంది పడుతాయి. పాలనలో ఇది ప్రత్యక్ష అనుభవమే. ఈ మొత్తం వ్యవహారంలో ఇన్ఫ్రా అథారిటీ స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంది. అయితే వాస్తవానికి అలా జరగనే లేదు. ** చట్ట నిబంధనల ప్రకారం రాష్ట్రానికి వచ్చే వాణిజ్యపరమైన ప్రయోజనాలను అధికారులు ముందు చూడాలి. ఆ తరువాతే స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించాలి. కాని అధికారులు అందుకు విరుద్ధమైన విధానాన్ని అనుసరించారు. మొదట స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించి, ఆ తరువాత వాణిజ్యబిడ్లను పరిశీలిస్తామంటున్నారు. ఇది ‘గుర్రానికి ముందు బండి ఉంచడమే’. ఇది విధానపరమైన అవకతవక మాత్రమే కాదు.. ప్రజా ప్రయోజాలను ప్రమాదంలో నెట్టి వేయడమే అవుతుంది. ** ఈ మొత్తం వ్యవహారంలో అనుసరించిన విధానాన్ని చూస్తే ఏ అధికారి కూడా సహేతుకంగా, నిష్పాక్షికంగా చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించలేదు. తక్కువ వ్యయంతో కూడుకున్న ‘రాజీ’ నిబంధనలను పక్కనపెట్టి, వ్యయంతో కూడిన లండన్‌లోనే కూర్చొని చేసే మధ్యవర్తిత్వ క్లాజ్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ** నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతల విషయానికొస్తే, ‘భారతదేశం వెలుపల అనుభవం’ అన్న నిబంధన పక్షపాతంతో కూడుకున్నది. ఈ ప్రాజెక్టు విస్తృతిని దృష్టిలో పెట్టుకుని, సాంకేతికంగా, ఆర్థికంగా సింగపూర్ కన్సార్టియంతో సరితూగే లేదా వారి కన్నా ఎక్కువ అర్హతలున్న వారికే పనులు అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈ అర్హతలు నిరే్ధశించినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వాదన ఎంత మాత్రం సహేతుకంగా లేదు. ** ఈ కేసులో తన హక్కులకు భంగం కలుగుతుందని పిటిషనర్లు భావించారు కాబట్టే కోర్టుకు వచ్చారు. తుది విచారణలో అర్హతల, నిబంధనల చట్టబద్దత తేలుతుంది. ఈ కేసులో ప్రభుత్వం, సీఆర్డీఏ వాదనలు ఎలా ఉన్నాయంటే ‘ఆసక్తి’ ఉన్న దరఖాస్తుదారులు అంటే.. బిడ్డింగ్‌కు అర్హత ఉన్న వారు మాత్రమే.. అన్న అర్థంలో ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు అంటే అర్హత లేని వారు అని కాదు. ఆసక్తి ఉన్న వ్యక్తి అర్హత లేకపోయినా బిడ్ దాఖలు చేయవచ్చు. బిడ్ దాఖలు చేసిన తరువాత అర్హత ఉందా? లేదా? తేలుతుంది. కాబట్టి వారికి కోర్టును ఆశ్రయించే అర్హత, ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత లేదనడం సరికాదు. ఏపీఐడీఈ చట్టానికి ప్రభుత్వం చేసిన కీలక సవరణలివీ ఏపీఐడీఈ చట్టంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఐడీఏ)కు అత్యంత ప్రాధాన్యత ఉంది. సింగిల్ జడ్జి తప్పుబట్టిన అనేక అంశాలు ఇన్ఫ్రా అథారిటీతో ముడిపడి ఉండటంతో ప్రభుత్వం ఆ అ«థారిటీని నామమాత్రం చేయాలని నిర్ణయించి అందుకనుగుణంగా ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేసింది. ఈ చట్టం ఏ విషయాల్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి విస్తృత అధికారాలు కల్పిస్తుందో, ఎక్కడెక్కడ ఈ అథారిటీని సంప్రదించాలని ఉందో, ఆ విషయాలన్నింటిలో ఇన్ఫ్రా అథారిటీ అన్న పేరును తొలగించి దాని స్థానంలో‘ప్రభుత్వం’ అన్న పదాన్ని చేర్చింది. ** ఏదైనా ప్రాజెక్టు విషయంలో సలహాలు, సూచనలు, సిఫారసులు చేసే అధికారం ఇక ఇన్ఫ్రా అథారిటీకి ఉండదు. అలాగే ప్రాజెక్టు అమలు విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలకైనా, డెవలపర్‌కైనా తగిన ఆదేశాలు జారీ చేసే అధికారం కూడా ఇకపై ఇన్ఫ్రా అథారిటీకి ఉండదు. ** సమావేశాలు నిర్వహించే అధికారం కూడా అథారిటీకి ఉండదు. అథారిటీకి పలు అధికారాలు కల్పిస్తున్న ఏపీఐడీఈ చట్టంలోని 11, 12 సెక్షన్లను చట్ట సవరణ ద్వారా తొలగించింది. ** డెవలపర్ తన హక్కులను దుర్వినియోగం చేస్తే అందుకు దుర్వినియోగ చార్జీలు విధించి, ఆ డెవలపర్‌పై కఠిన చర్యలు తీసుకునే అధికారం ఇన్ఫ్రా అథారిటికీ ఉండదు. డెవలపర్‌కు జరిమానా విధించే అధికారం కూడా అథారిటీకి లేకుండా సవరణలు చేసింది. ** ఏపీఐడీఈ చట్టంలో రాజీ క్లాజులే వర్తించకుండా ఉండేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. రాజీ క్లాజుకు ఇరుపక్షాలు కూడా అంగీకరించకుంటే ఏపీఐడీఈ చట్టంలోని చాప్టర్ 5, 6 (రాజీ విధి విధానాలు) వర్తించవంటూ చట్టాన్ని సవరించింది. దీంతో అధిక వ్యయంతో కూడిన మధ్యవర్తిత్వానికే వెళ్లడం తప్పనిసరి కానుంది. ** ఏపీఐడీఈ చట్టంలో ఆసక్తి ఉన్న వారందరూ బిడ్ దాఖలకు అర్హులని ఉండేది. చట్ట సవరణ ద్వారా ఆసక్తి ఉన్న వారందరూ అన్న పదాన్ని తొలగించి దాని స్థానంలో అర్హత ఉన్న వారే బిడ్ దాఖలు చేయగలరంటూ మార్చేసింది. -
స్విస్ చాలెంజ్ తో లక్షకోట్లకు ఎసరు!
రాజధాని స్టార్టప్ ప్రాజెక్టు వెనుక మర్మమిదే.. బాబు బినామీలు, సింగపూర్ సంస్థల పక్కాప్లాన్ వాటాల మొదలు లాభాల వరకు అంతా మోసమే.. సాక్షి, హైదరాబాద్: సువిశాలమైన రహదారులు.. జల మార్గాలు.. కనుచూపు మేర విస్తరించిన పచ్చిక మైదానాలు.. అందమైన ఉద్యానవనాలు.. ఆహ్లాద వాతావారణాన్ని పంచే నదీ తీరం.. ప్లై ఓవర్లు.. ఆకాశహర్మా్యలు.. భూతల స్వర్గాన్ని తలపించే రీతిలో అంతర్జాతీయ నగరాలను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామంటూ 3డీ సినిమా చూపించిన సీఎం చంద్రబాబు, సింగపూర్ సంస్థల కన్సార్టియం... రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చకుండానే రియల్ ఎస్టేట్ దందా చేసి రూ.లక్ష కోట్లు కొట్టేయడానికి పథకం వేశారు. అందులో భాగంగా మొదలుపెట్టిన రాజధాని ‘స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు’ ఓ పెద్ద కుంభకోణం. దీని కోసమే ‘స్విస్ చాలెంజ్’ పుట్టుకొచ్చింది. ఇప్పటివరకు ప్రతి అడుగునూ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే వేసుకుంటూ వచ్చింది. స్థూలంగా ఇదీ కుంభకోణం... 1. సింగపూర్ సంస్థల కన్సార్టియం, సీసీడీఎంసీ(కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ)తో కలిసి ఏర్పాటుచేసే ఏడీపీ(అమరావతి డెవలపర్మెంట్ పార్టనర్)కు 1,691 ఎకరాలను అప్పగించింది. ఎకరం రూ.4 కోట్లుగా(కనీస ధర)గా నిర్ణయించింది. 1,691 ఎకరాల విలువ రూ.6,764 కోట్లు. 2. ఈ భూమికి రహదారులు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి కనీస సదుపాయాలు కల్పించేందుకు రూ.5,500 కోట్లు ఖర్చు చేయడానికి సర్కారు అంగీకరించింది. అంతే కాదు.. ఏడీపీలో సీసీడీఎంసీ వాటా రూపంలో రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. వెరసి రూ.12,485.9 కోట్లను ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందన్న మాట. ఇంత పెట్టుబడి పెట్టినా సీసీఎండీసీకి దక్కే వాటా ఎంతో తెలుసా..? కేవలం 42 శాతం మాత్రమే. 3. రూ.306.4 కోట్ల పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియంకు దక్కే వాటా 58 శాతం. అంతేకాదు.. సింగపూర్ కన్సార్టియంకు తొలుత 50 ఎకరాలు, ఆ తర్వాత 200 ఎకరాలను ఉచితంగా కట్టబెట్టేందుకు సర్కార్ అంగీకరించింది. ఇప్పటికిప్పుడు ఎకరం కనిష్ఠంగా రూ.20 కోట్లకు విక్రయించినా.. ఆ సంస్థలు పెట్టే పెట్టుబడి పోను ఆదిలోనే రూ.4,693.6 కోట్ల లాభం సింగపూర్ కన్సార్టియం దక్కించుకోనుంది. 4. ఇదొక ఎత్తయితే.. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ఇచ్చే వాటాను గోప్యంగా ఉంచడం మరొక ఎత్తు. ఆ గోప్యత వెనుక దాగిన వాస్తవం ఏమిటంటే.. ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా సీఎం చంద్రబాబు బినామీలు, సింగపూర్ కన్సార్టియం గుప్పిట్లోని మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో రూ.లక్ష కోట్లు కొట్టేయడానికి పక్కాగా ప్లాన్ వేశారు. తెరపైకి స్విస్‌చాలెంజ్ ఇలా.. రాజధాని ప్రకటనను తన కోటరీకి ముందే లీకులు ఇచ్చి ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడి అత్తెసరు ధరలకే రైతుల భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. రాజధాని నిర్మాణం ముసుగులో తొలి దశలోనే మరో రూ.లక్ష కోట్లు కొల్లగొట్టడానికి సర్కారు పెద్దలు ప్లాన్ వేశారు. అందులో భాగంగానే రాజధాని ‘స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు’కు అంకురార్పణ చేశారు. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ యాక్ట్(ఏపీడీఈఏ)–2001 చట్టాన్ని సింగపూర్ సంస్థల కన్సార్టియంకు చుట్టంగా మార్చి.. స్విస్ విధానంలో అసెండాస్–సిమ్బ్రిడ్జ్–సెమ్్బకార్ప్(సింగపూర్ సంస్థల కన్సార్టియం)లతో కలిసి ప్రతిపాదనలు రూపొందించారు. వాటికన్నా మెరుగైన ప్రతిపాదనలు ఉంటే దాఖలు చేసుకోవచ్చునంటూ జూలై 18న స్విస్ విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుతో వచ్చే ఆదాయంతో సింగపూర్ సంస్థల కన్సార్టియం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తాయన్నది గోప్యంగా ఉంచాయి. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు 1,691 ఎకరాలు రాజధానికి భూసమీకరణ ముసుగులో 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా లాక్కుంది. ఇందులో 1,691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం సింగపూర్ సంస్థల కన్సార్టియంకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ భూమిలో 371 ఎకరాల్లో రహదారులు, పార్కులు, మురుగునీటి కాలువలు వంటి కనీస మౌలిక సదుపాయాలకు కేటాయించారు. తొలి విడతగా 50 ఎకరాలు.. రెండో దశలో 200 ఎకరాల భూమిని సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. 50 ఎకరాల్లో ఉత్రే్పరక అభివృద్ధి కింద సింగపూర్ సంస్థలు ఎనిమిది లక్షల చదరపు గజాల్లో భనవాలు నిర్మిస్తాయి. ఈ 250 ఎకరాల్లో నిర్మించే భవనాలను విక్రయించగా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి పైసా వా టా కూడా సింగపూర్ సంస్థల కన్సార్టియం ఇవ్వదు. ఇది పోను మిగతా 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి.. ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు. ప్లాట్లు విక్రయించగా వచ్చిన ఆదాయంలో ఈ ప్రాజెక్టుకు అభివృద్ధికి వెచ్చించే వ్యయంపోనూ.. మిగతా సొమ్ములో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ సంస్థలు గోప్యంగా ఉంచాయి. ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో.. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల నియమించే మేనేజ్మెంట్ కంపెనీకి ఏడీపీ అప్పగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఏదన్నది ప్రతి పాదనల్లో వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఆ మేనేజ్మెం ట్ కంపెనీ సీఎం చంద్రబాబునాయుడు బినామీలది కావడం వల్లే గోప్యంగా ఉంచారన్నది బహిరంగ రహస్యం. ఈ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటు ప్లాట్లనూ విక్రయిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఏ పని చేపట్టినా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిటింగ్ చేస్తా యి. అక్రమాలపై ఎవరైనా పోలీసులను, కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. ఆడిటింగ్‌కు దక్కకుండా.. సీఆర్పీసీ, ఐపీసీ చట్టాలకు చిక్కకుండా దోపిడీ చేసేందుకే ‘మేనేజ్మెంట్ కంపెనీ’ అనే బినామీ ప్రైవేటు సంస్థను సీఎం చంద్రబాబు, సింగపూర్ సంస్థల కన్సార్టియం తెరపైకి తెచ్చాయి. ఈ సంస్థ ఎకరం రూ.20 కోట్లకు విక్రయించి.. రూ.4 కోట్లకు పైన ఎంతోకొంత నామమాత్రపు ధరకు అమ్మినట్లు లెక్కలు చూపించినా ప్రశ్నించే అధికారం రాష్ట్ర ఆడిటింగ్ అధికారులకుగానీ.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కుగానీ ఉండదు. ఒకవేళ ఏవైనా వివాదం ఉంటే.. ఇంగ్లాండ్‌లోని లండన్ కోర్టును ఆశ్రయించాల్సిందే! సీసీఎండీసీకి దక్కేది సున్నా.. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో 1070 ఎకరాలను విక్రయించగా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి వాటా ఇవ్వగా మిగిలిన సొమ్ము ఏడీపీకి వస్తుంది. ఎకరం రూ.4 కోట్లు అంతకన్నా కాస్త ఎక్కువకు విక్రయించి.. ప్రభుత్వానికి గ్రాస్ రెవెన్యూ షేర్లో పది శాతం వాటా ఇస్తే ఏడీపీకి దక్కేది రూ.3852 కోట్లు. ఏడీపీకి ఇచ్చే 250 ఎకరాల్లో ఎకరం రూ.నాలుగు కోట్ల చొప్పున విక్రయిస్తే వచ్చే సొమ్ము రూ.వెయ్యి కోట్లును కలిపితే రూ.4,852 కోట్లు వస్తుంది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వ్యయం రూ.3137 కోట్ల నుంచి ఏటా 20 శాతం చొప్పున పెరిగితే.. సీసీడీఎంసీకి దక్కేది బూడిదే. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో నష్టం వస్తే ఆ మేరకు సింగపూర్ సంస్థలకు పరిహారం చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే సింగపూర్ సంస్థలు లండన్ కోర్టులో కేసు వేస్తాయి. ఆ కోర్టు ఏ మేరకు జరిమానా విధిస్తే ఆ మేరకు ప్రభుత్వం ఆ సంస్థలకు పరిహారం చెల్లించాల్సిందే. రూ.లక్ష కోట్ల దోపిడీ ప్లాన్ ఇదీ.. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు 20 ఏళ్లపాటు అమల్లో ఉంటుంది. అంతకన్నా ముందు ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేస్తే సింగపూర్ సంస్థల కన్సార్టియం పెట్టిన పెట్టుబడికి 150 శాతం మేర అపరాధ రుసుం చెల్లించాలి. ఆ సంస్థలు తీసుకున్న బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లిం చాలి. ఒకవేళ సింగపూర్ సంస్థల కన్సార్టియం ప్రాజెక్టు నుంచి వైదొలగినా ఆ సంస్థలు పెట్టిన పెట్టుబడిని వంద శాతం ప్రభుత్వం చెల్లించాలి. బ్యాంకు రుణాలను చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. 20 ఏళ్లపాటు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు సింగపూర్ కన్సార్టియం చేతుల్లో ఉండేలా ప్లాన్ వేశారు. మేనేజ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని తాము అనుకున్నది అనుకున్నట్లు చేయడానికి ఎత్తువేశారు. ఎకరం భూమి కనీస ధర రూ.4 కోట్లకు ఎంతో కొంత నామమాత్రపు మొత్తాన్ని.. అంటే ఓ పాతిక లక్షలో యాభై లక్షలో కలిపి అమ్మినట్లు చూపిస్తారనుకుందాం. అది మాత్రమే వైట్ మనీ. ఎకరం రూ.20 కోట్లకు అమ్మినా అడిగేవారుండరు. ఎందుకంటే తమ చెప్పుచేతల్లో ఉండే మేనేజ్మెంట్ కంపెనీ యే ఈ అమ్మకాల లావాదేవీలను చూస్తుంది కాబట్టి మిగిలిన బ్లాక్‌మనీ అంతా దోచుకుంటారన్నమాట. గతంలో చంద్రబాబు హయాంలో ఎమ్మార్ విషయంలోనూ జరిగిందిదే. ఇదే తరహాలో మొత్తం భూమిని సింగపూర్ సంస్థల కన్సార్టియం, చంద్రబాబు బినామీలు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. రాజధానిలో అత్యంత ప్రధానమైన ప్రాంతంలో ఇప్పటికప్పుడు గజం కనిష్ఠంగా రూ.40 వేలు పలుకుతుంది. ఈ లెక్కన ఎకరం రూ.20 కోట్లు పలుకుతుంది. 20 ఏళ్లలోపు ఎకరం రూ.50 కోట్లకుపైగా పలుకుతుందని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే చెబుతున్నారు. ఈ లెక్కన ఎకరం రూ.50 కోట్ల చొప్పున 1070 ఎకరాల భూమిని అమ్మి రూ.53,500 కోట్ల ను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం సొమ్ము చేసుకోనున్నాయి. తొలుత 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాల భూమి సింగపూర్ సంస్థల కన్సార్టియంకు సర్కార్ కట్టబెట్టనుంది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.50 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.12,500 కోట్లు ఆ సంస్థలు సొమ్ముచేసుకున్నాయి. అంటే.. సింగపూర్ సంస్థలు పెట్టే రూ.306.4 కోట్ల పెట్టుబడికి 20 ఏళ్లలోగా రూ.12,193.60 కోట్ల లాభం దక్కించుకోనున్నాయి. మొత్తమ్మీద స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే కనిష్ఠంగా రూ.65,693.60 కోట్లు.. గరిష్ఠంగా రూ.లక్ష కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థలు కాజేయనున్నట్లు స్పష్టమవుతోంది. 1691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే ఈ స్థాయిలో దోచుకుంటే 33 వేల ఎకరాల రాజధాని నిర్మాణంలో ఏ స్థాయిలో దోపిడీ చేయడానికి ప్లాన్ వేశారన్నది అంచనాలకే అందడం లేదు. సింగపూర్ సంస్థల చేతుల్లోనే అంతా.. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్టియం, సీసీడీఎంసీలతో ఏర్పాటయ్యే ఏడీపీ(అమరావతి డెవలపమెంట్ పార్టనర్) చేపడుతుంది. ఏడీపీ ఛైర్మన్‌గా సింగపూర్ సంస్థల ప్రతినిధి వ్యవహరిస్తారు. ఏడీపీలో ఆరుగురు సభ్యుల్లో నలుగురు సభ్యులు సింగపూర్ కన్సార్టియం ప్రతినిధులే ఉంటారు. అంటే.. ఏడీపీపై పూర్తి పెత్తనం సింగపూర్ సంస్థల కన్సార్టియందే. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం రూ.3137 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా రూ.306.4 కోట్లు. సీసీడీఎంసీ వాటా రూ.221.9 కోట్లు. మిగతా రూ.2618.70 కోట్లను బ్యాంకుల్లో భూమిని తనఖా పెట్టి రుణం రూపంలోనూ ప్లాట్లు విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వెచ్చిస్తారు. రహదారులు, మురుగునీటి కాలువలు వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ నిధులను ఖర్చు చేస్తుంది. ప్రచార ఖర్చులు, కన్సల్టెన్సీ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, మేనేజ్మెంట్ ఫీజు, వేతనాల రూపంలోనే సింగపూర్ సంస్థల కన్సార్టియం కొట్టేయనుంది. ప్రభుత్వానికి గరిష్టంగా రూ.12,057 కోట్ల నష్టం ఏడీపీలో సింగపూర్ సంస్థల కన్సార్టియంది 58 శాతం వాటా.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీడీఎంసీ వాటా 42 శాతం. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.3,137 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ వ్యయం ఎంతకైనా పెరగవచ్చు. ఆ మేరకు నిబంధనలు కూడా చేర్చారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా 1,070 ఎకరాలను.. ఎకరం రూ.4 కోట్లకు పైన నామమాత్రపు మొత్తానికి విక్రయించగా వచ్చే మొత్తం ఆదాయంలో ప్రభుత్వం ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ కన్సార్టియం బహిర్గతం చేయలేదు. ఒకవేళ ఎకరం రూ.నాలుగు కోట్లకే విక్రయించి, పది శాతం వాటా ఇస్తే.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.428 కోట్లు.. 20 శాతం వాటా ఇస్తే రూ.956 కోట్లు.. ఒకవేళ 50 శాతం వాటా ఇవ్వడానికి సింగపూర్ కన్సార్టియం ముందుకొచ్చిన సర్కారు దక్కే ఆదాయం రూ.2,140 కోట్లు మాత్రమే. అంటే.. ప్రభుత్వం రూ.12,485.9 కోట్లు పెట్టుబడి పెట్టుబడి పెడితే కనిష్ఠంగా రూ.10,345.9 కోట్లు(ప్రభుత్వానికి 50 శాతం వాటా ఇస్తే).. గరిష్ఠంగా రూ.12,057.9 కోట్ల(సర్కార్‌కు పది శాతం వాటా ఇస్తే) నష్టం వస్తుందన్న మాట. -
స్విస్ చాలెంజ్ కేసు నేటికి వాయిదా
-
స్విస్ చాలెంజ్ కేసు నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రధాన ప్రతిపాదకుడి (ఓపీపీ)గా ఉన్న సింగపూర్ కన్సార్టియంకు అంతర్జాతీయంగా పలు రంగాల్లో విశేష అనుభవం ఉందని, పోటీ ప్రతిపాదనలు సమర్పించే కంపెనీలు సైతం అదే స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతోనే అందుకు అనుగుణంగా టెండర్ నిబంధనలను రూపొం దించామని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. మార్కెటింగ్‌లో విశేష అనుభవానికి పెద్ద పీట వేసేందుకే ‘భారతదేశం వెలుపల అనుభవం’ అన్న నిబంధన పెట్టామన్నారు. స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ, బిడ్ల సమర్పణ గడువు తేదీలను పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్లపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏలు అప్పీల్ దాఖలు చేశాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలను కొనసాగించారు. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.