రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రధాన ప్రతిపాదకుడి (ఓపీపీ)గా ఉన్న సింగపూర్ కన్సార్టియంకు అంతర్జాతీయంగా పలు రంగాల్లో విశేష అనుభవం ఉందని, పోటీ ప్రతిపాదనలు సమర్పించే కంపెనీలు సైతం అదే స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతోనే అందుకు అనుగుణంగా టెండర్ నిబంధనలను రూపొం దించామని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. మార్కెటింగ్‌లో విశేష అనుభవానికి పెద్ద పీట వేసేందుకే ‘భారతదేశం వెలుపల అనుభవం’ అన్న నిబంధన పెట్టామన్నారు.