సింగపూర్ కన్సార్టియం-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సోమవారం ఎంవోయు కుదిరింది.
విజయవాడ: సింగపూర్ కన్సార్టియం-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సోమవారం ఎంవోయు కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రోజు మధ్యాహ్‌నం రెండు గంటలకు అమరావతి స్టార్టప్ ఏరియాకు మందడం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ ఎంవోయులో భాగంగా సింగపూర్ కంపెనీలకు 1691 ఎకరాలను ప్రభుత్వం అప్పగించనుంది.
మరోవైపు సింగపూర్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ లింగాయపాలెంలో రైతులు ఆందోళనకు దిగారు. రాజధానికి తమ భూమలను ఇవ్వలేదని రైతులు తెలిపారు. తమ అనుమతి లేకుండానే సింగపూర్ కంపెనీలకు భూములు ఎలా కట్టబెడతారని రైతులు ప్రశ్నించారు. వెంటనే సింగపూర్ కంపెనీలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను తరిమేయడానికి ప్రభుత్వం యత్నిస్తోందంటూ లింగాయపాలెంలోని అంబేడ్కర్ విగ్రహానికి రైతులు వినతిపత్రం సమర్పించారు.