సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. కానీ.. ఆచరణలో జరుగుతున్నది వేరే. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన కోటరీకి లీక్ చేసి ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’కు పాల్పడడం ద్వారా అత్తెసరు ధరలకే రైతుల భూములు కొట్టేసి ఇప్పటికే రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. ఇపుడు రాజధాని నిర్మాణం ముసుగులో మొదటి విడతలోనే మరో రూ.52,493.6 కోట్లు కొల్లగొట్టడానికి పథకం వేశారు.