వివాదాస్పదమైన రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధి కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) స్విస్ చాలెంజ్ విధానంలో మళ్లీ టెండర్లు పిలిచింది. గతంలో పిలిచిన టెండర్‌పై తీవ్రస్థాయిలో వివాదం చెలరేగడంతోపాటు కోర్టులోనూ సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం మొదటి నుంచీ ఎన్నో ఎత్తులు వేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. చివరికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఏకంగా ఏపీఐడీఈ చట్టాన్నే మార్చేసింది. దానికనుగుణంగా తాజాగా మళ్లీ టెండర్లు పిలిచింది. రెండురోజుల క్రితమే దీనిపై ఒక జీఓను సైతం విడుదల చేసింది.