స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు సీరియస్ అయింది. అసలు ఈ విధానం ఎవరి కోసమని ప్రశ్నించింది. కేవలం విదేశీ కంపెనీల కోసమేనా అని ప్రశ్నించింది. ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో ఇంత దాపరికం ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తులకు అధికారులు కేవలం ధర్మకర్తలు మాత్రమేనని, అంతే తప్ప ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోడానికి ఇవి ప్రైవేట్ ఆస్తులు కావని వ్యాఖ్యానించింది. అసలు స్విస్ ఛాలెంజ్ విధానం ఎందుకని ప్రశ్నించింది. సీల్డ్ కవర్ టెండర్ల విధానం మేలు కదా అంటూ ఆచరణలో మాత్రం వేరేవి జరుగుతున్నాయని ఈ విషయం అందరికీ తెలుసు అని వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు శుక్రవారం ఇస్తామని తెలిపింది.