స్విస్ చాలెంజ్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి నిర్మాణలను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి, లక్షలకోట్లు సంపాదించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని అయితే దాన్నే న్యాయస్థానాలు అడ్డుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం అంబటి రాంబాబు పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... స్విస్ చాలెంజ్ అప్పీల్ నుంచి ప్రభుత్వం ఒక్కసారిగా ఉపసంహరించుకుందన్నారు.