ఆదాయ వివరాలు ప్రభుత్వానికే తెలియవా? | High Court comments on state government | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 20 2016 7:21 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

రాజధాని ప్రాంత అభివృద్ధి వ్యవహారంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికే తెలియకపోవడంపై హైకోర్టు ధర్మాసనం సైతం విస్మయం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సింగిల్ జడ్జి ‘స్విస్ చాలెంజ్’పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ధర్మాసనం కూడా ఆదాయ వివరాలు తెలుసుకోకుండానే ముందుకెలా వెళుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయం సంతృప్తికరంగా లేకపోతే ఎలా? అని నిలదీసింది. ‘అయినా ఆదాయ వివరాల్లో అంత రహస్యం ఏముంది? ఎందుకు రహస్యంగా ఉంచాలని భావిస్తున్నారు..’ అని అడిగింది. దీనికి అటార్నీ జనరల్ సమాధానమిస్తూ.. ఆదాయ వివరాలు ‘యాజమాన్య సమాచారం’ అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement