హైదరాబాద్: స్విస్ చాలెంజ్ విధానంపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
కాగా రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్షియం చేసిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ జారీ అయిన నోటిపికేషన్లలో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రామచంద్రరావు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్ నిన్న ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనల అనంతరం విచారణను రేపటికి వాయిదా పడింది.