ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు: ఏపీ ఏజీ
హైదరాబాద్ : స్విస్ చాలెంజ్ కేసు విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఇవాళ మరోసారి వాదనలు వినిపించారు. సింగపూర్ కంపెనీలకు లబ్ది చేకూర్చేలా నిబంధనలు ఉన్నాయన్న ఆరోపణల‍్లో వాస్తవం లేదన్నారు. అంతర్జాతీయ కంపెనీలతో కలిసి ఇండియన్ కంపెనీలు జాయింట్ వెంచర్ ద్వారా బిడ్డింగ్లో పాల్గొనవచ్చని ఏపీ ఏజీ తెలిపారు.
సింగపూర్ కన్సార్షియం నెట్ వర్త్ రూ.60వేల కోట్లు ఉందని, రూ.2వేల కోట్లు ఉంటే చాలని నిబంధనల్లో పెట్టారన్నారు. ఒకవేళ మేలు చేయాలనుకుంటే ఆ నిబంధన అలా ఉండేది కాదని, గన్నవరం విమానాశ్రయంను ఎల్ అండ్ టీ కి అప్పగిస్తే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనులు చేయలేకపోయిందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు.