స్విస్ చాలెంజ్ ఓ మాయాజాలం | No challenge only match fixing in Swiss challenge | Sakshi
Sakshi News home page

స్విస్ చాలెంజ్ ఓ మాయాజాలం

Published Wed, Sep 28 2016 1:23 AM | Last Updated on Sat, Jul 28 2018 3:15 PM

స్విస్ చాలెంజ్ ఓ మాయాజాలం - Sakshi

స్విస్ చాలెంజ్ ఓ మాయాజాలం

ఆయా కంపెనీలు తమంత తాముగా బిడ్‌లు సమర్పించడమే స్విస్ చాలెంజ్. కానీ సింగపూర్ మంత్రి తనకిష్టమైన కంపెనీల పేర్లు చెప్పటం, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిం చడం.. ‘ఈశ్వర చంద్ర’ల మ్యాచ్ ఫిక్సింగ్ తప్ప దీంట్లో చాలెంజ్ ఎక్కడుంది?
 
 అమరావతి నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించ  బోతున్న స్విస్ చాలెంజ్ విధా నంలో లోపాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో కేవలం 12 దేశాలు మాత్రమే ఇంతవరకూ ఈ విధానాన్ని పాక్షికంగా పాటి స్తున్నాయి. రాష్ట్రంలో చంద్ర బాబు ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్న ఈ స్విస్ చాలెంజ్ విధానం ఒక మహా మ్యాచ్ ఫిక్సింగ్ అన్న అనుమానం కలుగుతోంది. అమరావతి మాస్టర్‌ప్లాన్ తయారీ దగ్గర నుంచి సీడ్ క్యాపిటల్ నిర్మా ణానికి సింగపూర్ కంపెనీల పేర్లను ప్రతిపాదించేంత వరకు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఎస్. ఈశ్వరన్ అనుసరించిన విధానాలు, వాటికి అనుగుణంగా చంద్ర బాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పరిశీలిస్తే ఈ అను మానాలకు బలం చేకూరుతోంది.
 
 సింగపూర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎస్. ఈశ్వ రన్ ఆ దేశంలోని పలు కంపెనీలకు మేనేజింగ్ డైరక్టర్ గానూ, డెరైక్టర్‌గాను ఉంటున్నారు. ఆయన 2013, జనవరి 13వ తేదీ నుంచి డెరైక్టర్‌గా ఉన్న సెంబ్‌కార్ప్ ఇండ్రస్టీ వాటిలో ఒకటి. ఈశ్వరన్ తాను డైరక్టర్‌గా ఉన్న సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీ పాటు అసెండాస్ - సింగ్‌బ్రిడ్జ్ అనే మరో కంపె నీతో కలిపి అమరావతి నగర నిర్మాణానికి బిడ్ దాఖలు చేయించారు. అసెండాస్ - సింగ్‌బ్రిడ్జ్ కంపెనీ ప్రస్తుత చైర్మన్ వాంగ్‌కాన్ సెంగ్ గతంలో సింగపూర్ డిప్యూటీ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. ఆయన కంపెనీ లోనూ ఈశ్వరన్‌కు పెద్ద మొత్తంలో షేర్లు ఉన్నాయి.
 
 తాను డెరైక్టర్‌గా ఉన్న కంపెనీకి, తనకు పెద్ద మొత్తంలో షేర్లు ఉన్న కంపెనీకి లబ్ధి చేకూర్చడానికి సింగపూర్ మంత్రి ఎస్. ఈశ్వరన్ తొలినుంచీ ప్రయత్ని స్తున్నారన్నది తేటతెల్లమైపోయింది. కచ్చితంగా ఇది క్విడ్ ప్రోకో క్రిందికే వస్తుందని నిపుణుల అభిప్రాయం.
 
 ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణ మాస్టర్ ప్లాన్‌లు తయారు చేయడానికి, నగర నిర్మాణానికి సింగ పూర్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని మొదట చంద్రబాబు ప్రకటించారు. కానీ, అనంతరం చర్చలన్నీ ఎస్. ఈశ్వరన్ - చంద్రబాబు మధ్య ప్రైవేట్ చర్చలుగా మారటం జగమెరిగిన సత్యం. ఈ చర్చలు, ఒప్పందాల ఫలితంగా అమరావతి నిర్మాణానికి మూడు మాస్టర్ ప్లాన్‌లు తయారు చేసే బాధ్యతను ఈశ్వరన్ తన దేశానికి చెందిన ప్రభుత్వ శాఖకు కాకుండా ప్రైవేట్ కంపెనీ సుర్బానా జురాంగ్‌కు అప్పగించాలని సిఫార్సు చేశారు. దానికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ల కోసం ఆ కంపెనీకి కోట్లాది రూపాయలు చెల్లించింది.
 
 గతంలో విశాఖలో ఒక చిన్న టౌన్‌షిప్‌ను నిర్మించలేక మధ్యలోనే కాంట్రాక్ట్‌ను వదులుకున్న జురాంగ్ కంపెనీ అమరావతి నగర నిర్మాణానికి మాస్టర్ ప్లాన్‌లు తయారు చేయడమే కాకుండా నగర నిర్మాణంలో పాలుపంచుకోవ   డానికి బిడ్ దాఖలు చేయబోయింది. అయితే అనూ హ్యంగా ఎస్. ఈశ్వరన్ గత ఏడాది జూలై 20 తేదీన తాను డెరైక్టర్‌గా ఉన్న, తనకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్న సెంబ్ కార్ప్ డెవలప్‌మెంట్, అసెండాస్ - సింగ్‌బ్రిడ్జ్ కంపెనీలను తెరపైకి తెచ్చి అవి బిడ్‌లు దాఖలు చేయబోతున్నట్లు సింగ పూర్ అధికార పత్రిక స్ట్ట్రెట్ టైమ్స్‌కు తెలిపారు. ఆయన సలహామేరకే ఈ స్విస్ చాలెంజ్ విధానంలో బిడ్‌లు వేయ వలసిందిగా చంద్రబాబు ఈ కంపెనీలనే ఆహ్వానిం చారు. ఇది స్విస్ చాలెంజ్ ప్రాథమిక సూత్రాలకే పూర్తి విరుద్ధం.
 
 స్విస్ చాలెంజ్ విధానం ప్రకారం ఆయా కంపెనీలు తమంత తాము బిడ్‌లు సమర్పించాలి. కాని సింగపూర్ మంత్రి తనకు ఇష్టమైన కంపెనీల పేర్లు చెప్పడం, వాటికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం పలు అనుమానాలకు, అపోహలకు తావిస్తోంది. అమరావతి నగర నిర్మాణానికి బిడ్ దాఖలు చేసిన సెంబ్‌కార్ప్ కంపెనీపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ కంపెనీ బ్రెజిల్‌లో 12 డ్రిల్లింగ్ రిగ్గుల నిర్మాణ కాంట్రాక్ట్ పొంద డానికి పెట్రోబ్రాస్ అధికారులకు 9.50 మిలియన్ అమెరి కన్ డాలర్ల లంచం ఇచ్చి బ్రెజిల్ న్యాయస్థానంలో దోషిగా నిలబడింది. ఎస్. ఈశ్వరన్ మంత్రి హోదాలో ఉంటూ తాను డైరక్టర్‌గా ఉన్న కంపెనీకి అయాచిత లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు.
 
 మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగపూర్ పేరుతో కళంకితమైన ఆ దేశ ప్రైవేట్ కంపెనీలను ఆహ్వాని స్తోంది. ఈ నిర్ణయాలు చూస్తుంటే చంద్రబాబు-ఈశ్వరన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలు కలుగు తున్నాయి.
 
 పోటీయే లేని స్విచ్ చాలెంజ్‌లో లబ్ధి పొందడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సకల చట్టాలనూ తుంగలో తొక్కింది. ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబ్లింగ్ యాక్ట్ (ఏపీఐడీఈఏ) 2001 చట్టం ప్రకారం రాష్టంలో ఏ సంస్థకైనా ప్రభుత్వం అప్పగించే భూము లకు గరిష్టంగా 33 ఏళ్లకు మాత్రమే లీజుకు ఇవ్వాల్సి ఉండగా సింగపూర్ సంస్థల కోసం భూమిపై 99 ఏళ్లకు లీజు లేదా పూర్తి హక్కులు కల్పించేలా మార్పులు చేయడం ప్రజా ద్రోహమే.
 
స్విస్ చాలెంజ్‌లో వాస్తవానికి ఏ చాలెంజూ లేదని మహా మ్యాచ్ ఫిక్సింగ్ అని, ఇదంతా ‘ఈశ్వర చంద్ర’ మాయాజాలంలో భాగమని గత కొన్ని నెలలుగా పుంఖా నుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనా లను తీవ్రంగా దెబ్బ తీస్తున్న స్విస్ చాలెంజ్ విధానాన్ని చట్టపరంగానే కాకుండా, అన్ని రకాలుగా ఎదుర్కోవడం ఏపీ ప్రయోజనాల రీత్యా ఎంతైనా ఆవశ్యం.
 వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షుడు,
 ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్‌అసోసియేషన్
 మొబైల్ : 95052 92299
 - వీవీఆర్ కృష్ణంరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement