అనుకున్నట్లే అయింది. సింగపూర్ కన్సార్టియం కోసం ఏపీఐడీఈ (ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్) చట్టంలో మార్పులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇన్‌ఫ్రా అథారిటీ అధికారాలను పూర్తిగా తగ్గించి అంతా ప్రభుత్వం చెప్పు చేతల్లోనే జరిగేలా చట్టాన్ని మార్చాలని నిర్ణయించింది. స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని స్టార్టప్ ఏరి యా అభివృద్ధి ప్రాజెక్టును సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు అడ్డుగా ఉన్న ఈ చట్టాన్ని ప్రభుత్వం సవరించనుందనే విషయాన్ని ‘సాక్షి’ ఇటీవల బయటపెట్టిన విష యం తెలిసిందే. ఈ చట్టంలో మార్పులకు చర్చ లేకుండానే మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.