ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోంది. ఈ కేబినెట్ భేటీలో హైదరాబాద్లోని ఏపీ సచివాలయ భవనాలు తెలంగాణకు అప్పగింత, స్విస్ ఛాలెంజ్ విధానంలో కొత్త నోటిఫికేషన్, భూకేటాయింపులు, ఇళ్ల నిర్మాణాలు, నీటి పారుదల ప్రాజెక్టులు, ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి పెంపు, సిద్ధార్థ అకాడమీకి దుర్గగుడి భూముల కేటాయింపు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.