ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, సింగపూర్ ప్రతినిధుల మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్విస్ ఛాలెంజ్ కేసులో అటార్నీ జనరల్ను తీసుకురావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. స్విస్ ఛాలెంజ్ను సమర్థించడానికి అటార్నీ జనరల్ అవసరమా అని వాసిరెడ్డి పద్మ అన్నారు.