హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు తీర్పును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ‍్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్వాగతించారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ వేల కోట్ల అవినీతి కోసమే చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తెరపైకి తెచ్చారన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానంపై మొదటి నుంచి వైఎస్ఆర్ సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోందన్న విషయాన్ని ఎమ్మెల్యే కాకాణి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు అనుకూలమైన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే బాబు ప్రయత్నాలు అని విమర్శించారు.
కాగా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అనురిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై ఉన్నత న్యాయస్థానం ఇవాళ స్టే విధించింది. ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
‘అందుకే స్విస్ ఛాలెంజ్ తెరపైకి’
Published Mon, Sep 12 2016 12:58 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement