లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు | ap government lunch motion petition rejected by hi court | Sakshi
Sakshi News home page

లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

Published Wed, Sep 14 2016 1:04 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు - Sakshi

లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

హైదరాబాద్: 'స్విస్ చాలెంజ్‌‌' విధానంపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఏపీ అడ్వొకేట్ జనరల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ పిటిషన్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని రేపు (గురువారం) పరిశీలిస్తామని తెలిపింది.

ప్రభుత్వానికొచ్చే ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండానే సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ కమిషనర్ గత నెల 18న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్.. ఆ నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తూ గత నెల 28న జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసింది. దీంతో ఈ ప్రక్రియను సీఆర్‌డీఏ పక్కన పెట్టింది. హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 31న తిరిగి 'స్విస్ చాలెంజ్‌‌'పై హైకోర్టు విచారించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement