స్విస్ ఛాలెంజ్ ఫైల్ను కేబినెట్ ఆమోదించనుంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. ఈ సమావేశంలో స్విస్ ఛాలెంజ్ ఫైల్ను కేబినెట్ ఆమోదించనుంది. దీనిద్వారా సింగపూర్ కంపెనీలకు రాజధానిలో 58 శాతం వాటాను కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే ఇవాళ్టి సమావేశంలో ఉద్యోగుల తరలింపు అంశంపై మంత్రివర్గం చర్చించనుంది.
రాజధానిలో ఆసుపత్రులు, పలు విద్యాసంస్థలకు నేటి కేబినెట్ సమావేశంలో భారీగా భూములు కెటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు రంగంలో వ్యవసాయ కళాశాలల ఏర్పాటుతో పాటు రేషన్ డీలర్ల కమీషన్ల పెంపు తదితర అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.