సింగపూర్ని మించిన కంపెనీలు ఇండియాలో..
హైదరాబాద్: స్విస్ చాలెంజ్పై ప్రతి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాస్తోందని ఆదిత్యా కన్స్ట్రక్షన్స్, ఎన్వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరుపున న్యాయవాదులు ప్రకాశ్ రెడ్డి, వేదుల వెంకట రమణ వాదనలు వినిపించారు. విదేశీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. స్విస్ ఛాలెంజ్పై ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణ రేపటికి వాయిదా పడింది. గురువారం ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ వాదనలు వినిపించనున్నారు.
బుధవారం నాటి వాదనల సందర్భంగా పిటిషనర్ల తరుపున పలు అంశాలను న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విదేశాల్లో అనుభవం ఉండాలనే నిబంధన సరికాదని కోర్టుకు తెలిపారు. సింగపూర్ కన్సార్టియంకు లబ్ది చేకూర్చేందుకే ఆ నిబంధన పెట్టారని చెప్పారు. సింగపూర్ కన్నా ఎక్కువ ప్రాజెక్టులను డెవలప్ చేసిన కంపెనీలు ఇండియాలో చాలా ఉన్నాయని గుర్తుచేశారు. స్విస్ చాలెంజ్ విషయంలో ప్రభుత్వం ప్రతి విషయాన్నిదాస్తోందని, సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమకు అనుకూలమైన వారికి టెండర్ దక్కేలా బిడ్డింగ్ ప్రాసెస్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.