సాక్షి,హైదరాబాద్: హైడ్రాపై కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం(అక్టోబర్ 23) హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో బెంచ్ ముందు పాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు. పాల్ వాదనలు విన్న కోర్టు హైడ్రాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాను ఆదేశించింది.
నిర్వాసితులు ప్రత్యామ్నాయం చూసుకునేంతవరకు బాధితులకు సమయం ఇవ్వాలని సూచించింది. మూసీ బాధితులకు ఇల్లు కట్టించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితులకు ఇల్లు కేటాయించిన తర్వాతే కూల్చివేస్తున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రాను హైకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment