పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి
సాక్షి, హైదరాబాద్/అమరావతి: నూతన రాజధాని పేరుతో ఇప్పటికే నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారని చంద్రబాబుపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో వారు మాట్లాడారు. ఈ నెల 28న పరిపాలన భవనాల కోసం అంటూ అరుణ్ జైట్లీని చంద్రబాబు, బాబును వెంకయ్య అభినందించడానికే శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు.ప్రజల సొమ్ముతో ఇంకా ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారో తెలియడం లేదని మండిపడ్డారు.
యూపీఏ ప్రభుత్వం పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చట్టంలో పేర్కొంటే బాబు అసమర్థత, చేతగానితనం, బలహీనతల వల్లనే తన మకాం హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చాడని ఆరోపించారు. స్విస్ చాలెంజ్‌లోని అవకతవకలు కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డినెన్స్‌ను మార్చుకున్నారని విమర్శించారు.
రాజధాని పేరుతో నాలుగు శంకుస్థాపనలు
Published Sun, Oct 30 2016 2:03 AM | Last Updated on Fri, May 25 2018 7:10 PM
Advertisement