
సాక్షి, తిరుపతి జిల్లా: సమృద్ధిగా వర్షాలు కురవడానికి వరుణ యాగం నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. గత నెలలో తిరుమలలో జరిగిన వరుణయాగం వల్ల వర్షాలు కురిసాయన్నారు. శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగంలో భాగంగా వేడుకగా శుక్రవారం ఉదయం.. ఆచార్య రుత్విక్ వరణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌తో పాటు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ వరుణ యాగానికి ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరగనుందని తెలిపారు. గత నెలలో తిరుమలలో జరిగిన వరుణ యాగం వల్ల వర్షాలు కురిసాయని, రానున్న రెండేళ్లలో వర్షపాతం తక్కువ నమోదవుతుందని వాతావరణ శాఖ సూచన మేరకే వరుణ యాగం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.
చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు
Comments
Please login to add a commentAdd a comment