Varuna Yagam
-
సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ యాగం: టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుపతి జిల్లా: సమృద్ధిగా వర్షాలు కురవడానికి వరుణ యాగం నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. గత నెలలో తిరుమలలో జరిగిన వరుణయాగం వల్ల వర్షాలు కురిసాయన్నారు. శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగంలో భాగంగా వేడుకగా శుక్రవారం ఉదయం.. ఆచార్య రుత్విక్ వరణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌తో పాటు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ వరుణ యాగానికి ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరగనుందని తెలిపారు. గత నెలలో తిరుమలలో జరిగిన వరుణ యాగం వల్ల వర్షాలు కురిసాయని, రానున్న రెండేళ్లలో వర్షపాతం తక్కువ నమోదవుతుందని వాతావరణ శాఖ సూచన మేరకే వరుణ యాగం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
దుర్గాఘాట్‌లో వరుణ యాగం
-
వర్షాల కోసం గుజరాత్ సర్కార్ పూజలు
సాక్షి, గాంధీనగర్ : గుజరాత్లో వరుణ దేవుడి కరుణ కోసం విజయ్ రూపానీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పూజలు చేసేందుకు సన్నద్ధమైంది. వరుణ దేవుడి కటాక్షం కోసం అన్ని జిల్లాల్లో 41 యాగాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గుజరాత్‌లోని 33 జిల్లాలు, ఎనిమిది నగరాల్లో మే 31న యజ్ఞాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. రికార్డు స్ధాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిన క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వరుణ యాగాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. చెరువులు, నదుల్లో పూడికతీతకు ప్రభుత్వం చేపట్టిన సుజలాం సుఫలం జల్ అభియాన్ కార్యక్రమంలో భాగంగానే వరుణ యాగాలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మే 31న జరిగే వరుణ యాగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారని, అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారని డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ తెలిపారు. ఈ వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో గుజరాత్ ముందవరుసలో ఉంది. -
పెంచలకోనలో శాస్త్రోక్తంగా వరుణయాగం
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వరుణ యాగాన్ని ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి పుష్కరిణిలో అర్చకులు వరుణ జపం నిర్వహించారు. అనంతరం స్వామివారి ముఖమండపంలో వర్షాలు కురిసేందుకు వరుణయాగం నిర్వహించారు. అనంతరం స్వామి వారి అంత్రాలయంలో మూలమూర్తికి 108 కలశాల్లోని జలాలు, సుగంధ ద్రవ్యాలతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, రామయ్యస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవాలని, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరుణయాగం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయపాలకవర్గ అధ్యక్షుడు తానంకి నానాజీ, పాలకవర్గసభ్యులు సోమయ్య, జ్యోతమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పోచారం దంపతుల వరుణయాగం
బిర్కూర్ : నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలోని తిరుమల దేవస్థానంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు శనివారం ఉదయం వరుణయాగం నిర్వహించారు. దేవస్థానం ఆవరణంలోని గణపతి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. -
నేడు ఆర్ట్స్ కళాశాల మైదానంలో వరుణయాగం
అనంతపురం అగ్రికల్చర్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వరుణుడి కటాక్షం కోసం శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో వరుణయాగం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (ఏపీ ఎల్డీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) డాక్టర్ పీడీ కొండలరావు సాక్షితో మాట్లాడుతూ...డీఆర్డీఏ, నగరపాలక సంస్థ అధికారుల సహకారంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 3 వేల మంది మహిళలు, పరంజ్యోతి ఆలయం నుంచి భక్తులు, అలాగే పెద్ద సంఖ్యలో పురోహితులు యాగంలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు యాగం ప్రారంభమవుతుందన్నారు. -
యాదాద్రిలో ముగిసిన వరుణ యాగం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని శివాలయంలో ఐదు రోజులుగా జరుగుతున్న వరుణ యాగం బుధవారం ముగిసింది. ఉదయం నుంచి రుద్రక్రమార్చన, హవనం అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఐదు రోజులుగా రుష్యశృంగ మహా మునికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు పూర్ణాహుతి అనంతరం విష్ణు పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. తర్వాత దేవతా ఉద్వాసన పలికారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బి. నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో వరుణయాగం
యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో నాలుగు రోజుల పాటు వరుణయాగం నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ యాగం ఈ నెల 24 వరకు జరుగుతుంది. ఈ మేరకు ఆలయ ఆర్చకులచే యాగం నిర్వహిస్తున్నట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, పంటలు సంవృద్ధిగా పండాలని ఈ యాగం చేపట్టినట్లు ఆమె తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వరుణయాగాన్ని విజయవంతం చేమాలని కోరారు. -
వర్షాల కోసం తెలంగాణలో వరుణయాగం
-
జలాశయంలో నీరు నిండాలని వరుణయాగం
-
వర్షాల కోసం వరుణయాగం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల చివరికి వచ్చినా ఇంకా వర్షాల జాడలేదు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వడగాలులు వీస్తున్నాయి. వడదెబ్బకు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వడగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఈ జిల్లాలో నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 23 మంది మృతి చెందారు. ఈ పరిస్థితులలో జనం వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలంటూ విజయవాడ కనకదుర్గ గుడిలో ఆలయ అధికారులు వరుణయాగం చేపట్టారు.