వర్షాల కోసం వరుణయాగం | Varuna Yagam for rains | Sakshi
Sakshi News home page

వర్షాల కోసం వరుణయాగం

Published Thu, Jun 19 2014 12:43 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

విజయవాడలోని కనకదుర్గ గుడి

విజయవాడలోని కనకదుర్గ గుడి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల చివరికి వచ్చినా ఇంకా వర్షాల జాడలేదు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వడగాలులు వీస్తున్నాయి. వడదెబ్బకు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో  వడగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఈ జిల్లాలో నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 23 మంది మృతి చెందారు.

ఈ పరిస్థితులలో జనం వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలంటూ విజయవాడ కనకదుర్గ గుడిలో ఆలయ అధికారులు వరుణయాగం చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement