పెంచలకోనలో శాస్త్రోక్తంగా వరుణయాగం | Varuna Yagam at Penchalakona | Sakshi
Sakshi News home page

పెంచలకోనలో శాస్త్రోక్తంగా వరుణయాగం

Published Mon, Aug 29 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

పెంచలకోనలో శాస్త్రోక్తంగా వరుణయాగం

పెంచలకోనలో శాస్త్రోక్తంగా వరుణయాగం

 
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వరుణ యాగాన్ని ఆదివారం  శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి పుష్కరిణిలో అర్చకులు వరుణ జపం నిర్వహించారు. అనంతరం స్వామివారి  ముఖమండపంలో వర్షాలు కురిసేందుకు వరుణయాగం నిర్వహించారు. అనంతరం స్వామి వారి అంత్రాలయంలో మూలమూర్తికి  108 కలశాల్లోని జలాలు, సుగంధ ద్రవ్యాలతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, రామయ్యస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవాలని, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరుణయాగం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయపాలకవర్గ అధ్యక్షుడు తానంకి నానాజీ, పాలకవర్గసభ్యులు సోమయ్య, జ్యోతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement