పెంచలకోనలో ఉచిత వైఫై సేవలు
పెంచలకోనలో ఉచిత వైఫై సేవలు
Published Sat, Sep 17 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో క్షేత్ర వివరాలను తెలిపే వెబ్‌సైట్, ఉచిత వైఫై సేవలను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. వెబ్‌సైట్ ద్వారా కోనలో జరిగే నిత్య కార్యక్రమాలు తెలుసుకోవచ్చునని వివరించారు. వెబ్‌సైట్‌ను మారెళ్ల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు సంపత్ రూపొందించినట్లు తెలిపారు. అలాగే పెంచలకోనలో సెల్ సిగ్నల్స్ అందక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైఫై సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. రూ.3లక్షల విలువ చేసే వైఫై హాట్‌స్పాట్‌ను హైదరాబాదుకు చెందిన సంస్థ ఉచితంగా అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నానాజీ, గూడూరు డీఎస్పీ శ్రీనివాస్, ఈఓ శ్రీరామమూర్తి, ధర్మకర్తలు సోమయ్య, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement