
యాదాద్రిలో వరుణయాగం
యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో నాలుగు రోజుల పాటు వరుణయాగం నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ యాగం ఈ నెల 24 వరకు జరుగుతుంది. ఈ మేరకు ఆలయ ఆర్చకులచే యాగం నిర్వహిస్తున్నట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, పంటలు సంవృద్ధిగా పండాలని ఈ యాగం చేపట్టినట్లు ఆమె తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వరుణయాగాన్ని విజయవంతం చేమాలని కోరారు.