యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని శివాలయంలో ఐదు రోజులుగా జరుగుతున్న వరుణ యాగం బుధవారం ముగిసింది. ఉదయం నుంచి రుద్రక్రమార్చన, హవనం అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఐదు రోజులుగా రుష్యశృంగ మహా మునికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు పూర్ణాహుతి అనంతరం విష్ణు పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. తర్వాత దేవతా ఉద్వాసన పలికారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బి. నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.