నిప్పులు చెరిగిన భూమన కరుణాకరరెడ్డి
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వచ్చారు. 14 ఏళ్లుగా తన కుమార్తెలను శ్రీవారి దర్శనానికి తీసుకురాని వ్యక్తి పవన్‌కళ్యాణ్. భక్తిపరులు, సనాతన ధర్మ ఆచార్యుల పిల్లలకు 9, 11 నెలలకే తలనీలాలు తీస్తారు. అలా చేయని పవనస్వామి సనాతన ధర్మ పరిరక్షకుడయ్యారు.
కొత్తగా అవతరించిన పరమ హంస పరివ్రాజకాచార్య,
మంత్రశాస్త్ర పయోనిధి, నరరూప నారాయణుడు, నిత్య సత్య ప్రవచనాల దీక్షాపరుడు, అస్కలిత బ్రహ్మచర్య దీక్షాపరుడు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పవన స్వాముల వారు మన తిరుపతికి వేంచేసి అనుగ్రహ భాషణం చేశారు. నిన్నకాక మొన్న తిరుపతిలో అడుగుపెట్టి, కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్తూ.. దారిపొడవునా వందల సంవత్సరాలుగా శాపగ్రస్తులైన కొన్ని మెట్లకు శాపవిముక్తి చేయడం కోసం కొన్ని చోట్లపడి దొర్లుతూ, కొన్నిచోట్ల పూర్తిగా పడిపోయారు. అలా తన స్వేదంతో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి తిరుమలకు చేరుకున్నారు.
సాక్షి, తిరుపతి: తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వు కేక పాట గుర్తొచ్చింది అంటూ ఎద్దేవా చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్టుగా పవనానంద స్వామి కలరింగ్ ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు. కల్లు తాగిన కోతిలా కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ తాజాగా వారాహి డిక్లరేషన్ సభలో చేసిన వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ‘‘తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వు కేక పాట గుర్తొచ్చింది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వచ్చారు. పవనానంద(పవన్) స్వాముల వారు వేంచేసినట్టుగా ఉంది. రాజకీయాలు మాట్లాడను అంటూ.. నా మీద, వైఎస్ జగన్ మీద ఇష్టానుసారం రాజకీయ ప్రేలాపనలు చేశారు. కోర్టులను కూడా హెచ్చరిస్తున్నట్టుగా పవన్ మాట్లాడారు. సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. కల్లు తాగిన కోతిలా ప్రసంగం కొనసాగింది.
.. హైందవ సంస్కృతికి పవన్ చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. అయోధ్యకు పంపిన లడ్డూలు నిజంగా కల్తీ అయితే శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయ్ పవన్. పవన్ హైందవ జాతిని కించపరుస్తున్నారు. సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియని వ్యక్తి పవన్. పీఠాధిపతులంతా తమ జీవితాలను త్యాగం చేశారు. ఈ పీఠాలకు ఏ విలువ లేదన్నట్టుగా పవన్ మాట్లాడారు. ఆయన మాటలు విని వారంతా భయపడిపోతారు. గొడ్డు మాంసం తప్పదనుకున్నప్పుడు ఆయన స్వీకరించి ముందుకే వెళతా అన్నారు. పవన్ పీఠంలో గొడ్డు మాంసం తీసుకోవచ్చు. పవన్ భాష మతి చలింపచేసేలా ఉంది. ఇప్పటి వరకు ఎవ్వరూ సనాతన ధర్మాన్ని పరిరక్షించలేదని మాట్లాడారు. పవన స్వాములు అల్వార్‌లా అవతరించినట్టు మాట్లాడుతున్నారు.
.. పవన్ గతంలో ఏనాడూ సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపైనా పవన్ నొటికొచ్చినట్టు మాట్లాడారు. పవన్ కల్యాణ్ మనసంతా విషంతో నిండి ఉంది. జనం నీ మాటలు వింటారని ఏదైనా మాట్లాడతావా పవన్. సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై హెచ్చరికలు జారీ చేస్తారా?. చెప్పిన అబద్ధాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఆరోపణలకు ఆధారాలు ఎక్కడ?. 14 ఏళ్లుగా తన కుమార్తెలను దైవ దర్శనానికి తీసుకురాని వ్యక్తి పవన్. సనాతన ధర్మ ఆచారకులు పిల్లలకు 9 నెలలకే తల నీలాలు తీయిస్తారు. అలా చేయని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు. ఆయన డిక్లరేషన్‌పై సంతకం చేస్తూ తిరుమలలో కనిపించారు. పవన్ సనాతన ధర్మం ప్రకారం బాప్టిజం తీసుకున్నా పర్వాలేదు.
తిరుమల ప్రసాదంలో పశువుల కొవ్వు వాడారు అన్నారు. పవన్ క్షుద్ర రాజకీయ నాయకుడు. మతం ముసుగులో నాటకం ఆడాలనుకుంటున్నాడు. హైందవ సంస్కృతికి చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. నేను మళ్లీ పవన్‌కి ఛాలెంజ్ చేస్తున్నాను. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా సిద్ధం. శ్రీవాణి ట్రస్టుపై చేసిన ఆరోపణలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పు. శ్రీవాణి ట్రస్టులో ఒక్క రూపాయి దుర్వినియోగం అయినా ఏ శిక్షకైనా సిద్ధం. ఏదేదో మాట్లాడి వెళ్లిపోవడం కాదు.. దేవుడిపై ప్రమాణం చేసి చెప్పు. మతం కోసం, సనాతన ధర్మం, ఆచారాలు అవగాహన లేకుండా మాట్లాడారు నేను ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటే పొరపాటు. రాజకీయ సభ పెట్టి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతానని ప్రేలాపనలు మాట్లాడావు. అధికారం కోసం సనాతన ముసుగు పవన్ వేసుకున్నాడు. ఆ ముసుగులో మతాల మీద దాడిచేసే పవన్ నైజం తేటతెల్లమైంది’ అంటూ భూమన తీవ్ర విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: పవన్‌కూ కోర్టులో మొట్టికాయలు తప్పవా?
Comments
Please login to add a commentAdd a comment