
సాక్షి, తిరుపతి : సంగీత దిగ్గజం ఎస్సీ బాల సుబ్రమణ్యం కరోనా వైరస్ బారినుంచి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి గురువారం పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల సుబ్రమణ్యం దేశంలోనే గొప్ప గాయకుడని ప్రశంసించారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గాయకుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎస్పీ బాల సుబ్రమణ్యానికి టీటీడీతో మంచి అనుబంధం ఉందని అన్నారు. ( ఆ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి: చిరంజీవి )
కాగా, ఎస్పీ బాలు ఆరోగ్యం విషమంగానే ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విదేశీ వైద్యుల సూచనలతో ఎక్మో పరికరంతో వైద్యం చేస్తున్నామన్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన కోలుకునే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment