అవినీతికి కేరాఫ్‌ చంద్రబాబు ప్రభుత్వం | Bhumana Karunakar Reddy Slams Chandrababu On Corruption | Sakshi
Sakshi News home page

అవినీతికి కేరాఫ్‌ చంద్రబాబు ప్రభుత్వం

Published Tue, Mar 20 2018 6:22 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Bhumana Karunakar Reddy Slams Chandrababu On Corruption - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. చోడవరం వెంకటేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరత్నాలు కమిటీ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ.. విశ్వసనీయతకు, రాజకీయ నిబద్దతకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిలువెత్తు నిదర్శనం అన్నారు. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్‌ మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్‌, మాజీ మంత్రి సత్యారావు, అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరదు కల్యాణితో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement