ధర్మపోరాట దీక్షలతో మరో డ్రామాకు సీఎం చంద్రబాబు తెర తీశారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి హోదా ఆవశ్యకతను చాటిచెప్పడంతో ఈ అంశం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు.