ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షనేత మిథున్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని... రాష్ట్రం తీవ్ర ఆర్థికసంక్షోభం ఎదుర్కొంటోందని వివరించారు.