వంచనపై గర్జన దీక్షా శిబిరం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల అదనపు ప్రాంతీయ పరిశీలకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. చిత్రంలో మాజీ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
తూర్పుగోదావరి ,కాకినాడ: హోదాను సాధిద్దామని వైఎస్సార్ సీపీ నేతలు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీచెరువు సెంటర్‌లో శుక్రవారం జరగను న్న ‘వంచనపై గర్జన’ సభా వేదికను ఉభయగోదావరి జిల్లాల అదనపు ప్రాంతీయ పరిశీలకులు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ జిల్లాల అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితర నేతలు పర్యవేక్షించి పార్టీ శ్రేణులకు సూచనలిచ్చారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సభ సాయంత్రం ముగిసేవరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వంచనపై గర్జనకు రాజకీయాలకు అతీతంగా మేధావులు, ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల జేఏసీలు, ప్రత్యేక హోదా కాంక్షించే ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ వేదికగా హోదా నినాదం మిన్నంటేలా దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్ మాట్లాడుతూ వంచనపై గర్జనకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పార్టీశ్రేణులు నల్లదుస్తులు ధరించి నిరసన కార్యక్రమానికి హాజరుకావాలని, ప్రభుత్వం కళ్లు తెరిపించే విధంగా సభను విజయవంతం చేసి ప్రజాభీష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజెప్పాలన్నారు. ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, ఫ్లోర్ లీడర్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కమిటీల ఇన్‌చార్జి చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులు పెదిరెడ్డి రామలక్ష్మి, జమలమడక నాగమణి, డాక్టర్ పితాని అన్నవరం, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డి జమీలు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పెద్ది రత్నాజీతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment