parliament speaker
-
నన్ను అడ్డుకున్నారు: స్పీకర్‌కు ఎంపీ రేవంత్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని స్పీకర్‌కు ఎంపీ రేవంత్ ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయంలో రేవంత్‌రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు వివరణ ఇస్తూ.. పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకునే ఉద్దేశం మాకు లేదని, రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లడాన్ని మేం ఎక్కడా అడ్డుకోలేదని తెలిపారు. రేవంత్‌రెడ్డి సోమవారం కోకాపేట భూముల సందర్శనకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రోజు తెల్లవారుజామున నుంచి ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించి రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం
సాక్షి, ఢిల్లీ: భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెండు లక్షలకు పైగా మొక్కలు నాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి అనుగుణంగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంటు ఆవరణలో లోక్‌సభ స్పీకర్‌చే ఎర్రచందనం మొక్కను నాటించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. -
స్పీకర్‌ను కలవనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు
ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు శుక్రవారం ఉదయం కలవనున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో పోలీసుల ప్రవర్తనపై స్పీకర్‌కు ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. విశాఖ ఆర్కే బీచ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ విమానాశ్రయంలోనే వైఎస్ జగన్, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లను నిర్బంధించి వెనుకకు పంపారు. వైఎస్ జగన్, ఎంపీల పట్ల పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేయాలని ఎంపీలు స్పీకర్‌ను కోరనున్నారు. -
పాలస్తీనా పార్లమెంట్ స్పీకర్ అరెస్ట్
రమల్లా: ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనా పార్లమెంట్ స్పీకర్ అజీజ్ ద్వెక్ను అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం వెస్ట్ బ్యాంక్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పాలస్తీనా వర్గాలు తెలిపాయి. ఆచూకీ తెలియకుండా పోయిన ముగ్గురు ఇజ్రాయెల్ విద్యార్థులకు కోసం ఆ దేశం గాలింపు చర్యలు చేపడుతోంది. విచారణలో భాగంగా హమాస్ సీనియర్ నేత అజీజ్‌ను అరెస్ట్ చేశారు. విద్యార్థులను హమాస్ అపహరించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహు ఆరోపించారు. కాగా ఈ సంఘటనలో తమ ప్రమేయం లేదని హమాస్ ఖండించింది. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటి దాకా మాజీ మంత్రులు, పార్లమెంట్ సభ్యులతో సహా 80 మంది పాలస్తీనీయులను అరెస్ట్ చేసింది.