
సాక్షి, ఢిల్లీ: భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెండు లక్షలకు పైగా మొక్కలు నాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పానికి అనుగుణంగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంటు ఆవరణలో లోక్‌సభ స్పీకర్‌చే ఎర్రచందనం మొక్కను నాటించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment