రమల్లా: ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనా పార్లమెంట్ స్పీకర్ అజీజ్ ద్వెక్ను అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం వెస్ట్ బ్యాంక్లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పాలస్తీనా వర్గాలు తెలిపాయి.
ఆచూకీ తెలియకుండా పోయిన ముగ్గురు ఇజ్రాయెల్ విద్యార్థులకు కోసం ఆ దేశం గాలింపు చర్యలు చేపడుతోంది. విచారణలో భాగంగా హమాస్ సీనియర్ నేత అజీజ్ను అరెస్ట్ చేశారు. విద్యార్థులను హమాస్ అపహరించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహు ఆరోపించారు. కాగా ఈ సంఘటనలో తమ ప్రమేయం లేదని హమాస్ ఖండించింది. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటి దాకా మాజీ మంత్రులు, పార్లమెంట్ సభ్యులతో సహా 80 మంది పాలస్తీనీయులను అరెస్ట్ చేసింది.
పాలస్తీనా పార్లమెంట్ స్పీకర్ అరెస్ట్
Published Mon, Jun 16 2014 8:26 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement