నాకు ప్రాణహాని ఉంది సర్‌: నిందితుడు శ్రీనివాసరావు |  Police sent Accused Srinivasarao to KGH | Sakshi
Sakshi News home page

నిందితుడు శ్రీనివాసరావుకు అస్వస్థత

Published Tue, Oct 30 2018 4:40 PM | Last Updated on Tue, Oct 30 2018 6:18 PM

 Police sent Accused Srinivasarao to KGH - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం బాగాలేదని పోలీసులకు తెలపడంతో కేజీహెచ్‌కు శ్రీనివాసరావును పోలీసులు తరలించారు. పోలీసులు శ్రీనివాసరావును భూజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లి వ్యాన్‌లో కూర్చోబెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి శ్రీనివాసరావు ఆహారం తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లే సందర్భంగా ‘నాకు ప్రాణహాని ఉంది సర్‌’ అని శ్రీనివాసరావు పేర్కొనడం గమనార్హం.

ఎడమ చేయి బాగా నొప్పి వస్తుందని, ఛాతిలో దడగా ఉందని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పడంతో వైద్యులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పరీక్షలు చేసిన వైద్యుల సూచనల మేరకు శ్రీనివాసరావును కేజీహెచ్‌కు తరలించారు. తన అవయవాలను దానం చేయాలంటూ నిందితుడు డాక్టర్లతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టు సమాచారం. సమస్య ఏంటి అని అడిగితే.. నాకు వైద్యం కాదు.. అవయవ దానం చేయడానికి సహకరించాలంటూ వైద్యులతో శ్రీనివాసరావు చెప్పినట్టు తెలుస్తోంది. బీపీ, పల్స్‌ రేట్లు నార్మల్‌గానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కేజీహెచ్‌ నుంచి నిందితుడు శ్రీనివాస్‌ను డిశ్చార్జ్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌కు తరలించారు.


మరోవైపు నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని సిట్ అధికారులు తెలిపారు. ప్రతి 48 గంటలకు కస్టడీలో ఉన్న నిందితుడికి వైద్య పరీక్షలు చేయించాలి. అందులో భాగంగానే ప్రైవేట్ వైద్యునితో పరీక్షించామన్నారు. కోర్టుకి వైద్య పరీక్షల నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వ కేజీహెచ్‌కి వైద్య పరీక్షల కోసం తరలించామని పేర్కొన్నారు. విచారణ సాఫీగా సాగుతోందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement